ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక మ్యాచులు నిర్వహించేందుకు అటు బీసీసీఐ కూడా అన్ని వేదికలను సిద్ధం చేస్తూ ఉంది. మార్చి 31వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఇక అన్ని జట్లు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్. ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలో కొంతమంది ఆటగాళ్లు అటు గాయం బారిన పడుతూ పూర్తిగా ఐపీఎల్ కు దూరమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఆటగాళ్లు ఇక గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతుండడంతో ఐపీఎల్లో పలు ఫ్రాంచైజిలకు షాక్ లు తప్పడం లేదు అని చెప్పాలి. అయితే ఇక మరి కొంతమంది ఆటగాళ్లు అటు అంతర్జాతీయ క్రికెట్లో బిజీ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్ కి అందుబాటులో ఉంటారా లేదా అన్నదానిపై కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పాలి. ఐపీఎల్ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడటానికి వస్తారా లేదా అన్న విషయంపై అనుమానం ఉండగా ఇటీవల అభిమానులకు గుడ్ న్యూస్ అందింది.


 న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఫాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ టోర్నీలో ఆడేందుకు తమ దేశ ఆటగాళ్లకు అనుమతి ఇచ్చింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఐపీఎల్ సమయంలోనే శ్రీలంకతో వన్డే సిరీస్ ఉన్నప్పటికీ కూడా కెన్ విలియమ్స్ తో పాటు మరికొంతమంది ప్లేయర్లను కూడా ఐపీఎల్ ఆడేందుకు పంపించబోతుంది అన్నది తెలుస్తుంది. కాగా గుజరాత్ జట్టులో కేన్ విలియమ్స్ ఆడుతుండగా, చెన్నై సూపర్ కింగ్స్ లో కాన్వే, సంట్నర్  ఉన్నారు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ టీం సౌదీ కోల్కతా జట్టులో ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఈ ముగ్గురు కూడా ఐపీఎల్ ఆడేందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl