ప్రస్తుతం భారత జట్టులో సీనియర్ క్రికెటర్లుగా కొనసాగుతున్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు. ఇక దాదాపు వీరిద్దరి కెరియర్ చివరి దశలో ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఇద్దరు సీనియర్లు కూడా గత కొంతకాలం నుంచి మూడు ఫార్మర్లలో ఒకే రకమైన ఫామ్ కొనసాగించడానికి ఇబ్బంది పడ్డారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం గడ్డు పరిస్థితుల నుంచి సూపర్ కం బ్యాక్ ఇచ్చాడు. గత ఏడాది వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ తో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. ఆ తర్వాత అదే రీతిలో ప్రతి ఫార్మాట్లో కూడా చెలరేగిపోతున్నాడు.


 మొన్నటికి మొన్న అటు ఐపిఎల్ లో కూడా వరుస సెంచరీలతో దుమ్మురేపాడు అని చెప్పాలి. దీంతో ఇక మరో రెండు మూడేళ్ల వరకు కూడా విరాట్ కోహ్లీ కెరియర్ గురించి ఎవరు వేలెత్తి చూపే ప్రసక్తి లేదు అని చెప్పాలి. కానీ రోహిత్ కెరియర్ మాత్రం రోజురోజుకు డేంజర్ లో పడిపోతుంది అన్నది తెలుస్తుంది. మాజీ ప్లేయర్ సునీల్ గావస్కర్ కూడా కోహ్లీని పొగుడుతూ రోహిత్ ని పట్టించుకోవడం మానేశాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్ ముందు బిజీ షెడ్యూల్ ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ తో వన్డే సిరీస్.. ఆసియా కప్.. స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ ఇలా తీరిక లేని షెడ్యూల్ తో టీమ్ ఇండియా ప్లేయర్స్ అందరూ కూడా బిజీ అవ్వనున్నారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ రోహిత్ లేకున్నా కోహ్లీ మాత్రం 2024 వరల్డ్ కప్ లో కచ్చితంగా ఉండాలని చెప్పుకొచ్చాడు. 2024 లో టి20 వరల్డ్ కప్ జరగబోతుంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో మరోసారి ఐపీఎల్ జరుగుతుంది. అప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఇదే ఫామ్ కొనసాగిస్తే అతనికి టి20 వరల్డ్ కప్ లో చోటు ఇవ్వాల్సిందే. ఇప్పటినుంచి విరాట్ కోహ్లీ టి20 లో ఆడించాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉంది. టెస్ట్ సిరీస్ లు కూడా ఆడబోతున్నారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చాలా అవసరం. ఇక పేలవ ఫామ్ లో ఉన్న రోహిత్, కేల్ రాహుల్ లేకున్నా విరాట్ కోహ్లీని మాత్రం టి20 లో ఆడించాలి అంటూ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: