గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. కీలకమైన టోర్నీలకు ముందు ఇక జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్స్ గాయం బారిన పడుతూ ఇక జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కు ముందు కూడా ఇలా టీమ్ ఇండియాను గాయాలు బెడద మాత్రం వీడటం లేదు. ఇప్పటికే జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న బుమ్రా వెన్నునొప్పి సర్జరీ కారణంగా కొన్ని నెలల నుంచి జట్టుకు అందుబాటులో ఉండడం లేదు.


 మరోవైపు ఐపీఎల్లో ఆడుతున్న సమయంలో ఇక శ్రేయస్ అయ్యర్ కూడా గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక కేఎల్ రాహుల్ సైతం కాలికి గాయం కావడంతో ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కి దూరమయ్యాడు. ఇక మరో కీలక ప్లేయర్ రిషబ్ పంత్ అటు రోడ్డు ప్రమాదం బారిన పడటం కారణంగా ఇక మరికొన్ని నెలల పాటు భారత జట్టుకు అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇలా ఇప్పటికే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కి ముందు నుంచి కూడా టీమ్ ఇండియాను గాయాలు బెడద వేధిస్తుండగా... ఇక ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ కి ముందు అటు టీం ఇండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మరో కీలక ప్లేయర్ గాయం బారిన పడ్డాడు. టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్కు గాయమైందట. డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం ఓవల్ గ్రౌండ్ లో టీమ్ ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా ఇషాన్ కిషన్ గాయపడినట్లు తెలుస్తోంది. అయితే గాయం తీవ్రత మరి అంత సీరియస్ కాకపోవచ్చు అని సమాచారం. అయితే ఇక ఇషాన్ కిషన్ గాయం పై అటు బిసిసిఐ పూర్తిస్థాయి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇకపోతే ఈనెల ఏడవ తేదీ నుంచి 11వ తేదీ వరకు టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. కీలకమైన ప్లేయర్స్ లేకుండా టీమిండియా ఎలా రాణిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc