ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మాట్ల ప్లేయర్ గా కొనసాగుతున్నాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న ఆల్ రౌండర్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా  రవీంద్ర జడేజా పేరు ముందు వరుసలో వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అతను స్పిన్ బౌలింగ్లో అదర కొట్టడమే కాదు అవసరమైనప్పుడల్లా.. ఇక బ్యాటింగ్లో మెరుపులు మెర్పిస్తూ ఉంటాడు. ఇక మైదానంలో రవీంద్ర జడేజా పాదరసంలా కదులుతూ చేసే విన్యాసాలు అయితే క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అబ్బురపరుస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి టీం కూడా తమకు జడేజా లాంటి ఆల్ రౌండర్ ఉంటే బాగుండేది అని కోరుకుంటారు అంటే ఇక అతని ఆట తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


 ఇక అలాంటి రవీంద్ర జడేజా  టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్లుగా మూడు ఫార్మాట్ లలో కూడా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కూడా అర్హత సాధించాడు. తన స్పిన్ బౌలింగ్ తో పర్వాలేదనిపించాడు. ఇటీవల ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సమయంలో తన స్పిన్ బౌలింగ్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. ఏకంగా కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. తద్వారా మంచి ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ను అవుట్ చేసి ఇక ఆ జట్టును దెబ్బ కొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ రెండు వికెట్లు తీయడం ద్వారా ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ స్పిన్నర్ ల జాబితాలో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నాలుగవ స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రవీంద్ర జడేజా టెస్ట్ ఫార్మాట్లో రెండు వందల అరవై ఏడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ లిస్టు చూసుకుంటే శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హేరాత్ 433 వికెట్లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈయనకి చేరువలో కూడా ఎవరూ లేరు అని చెప్పాలి. తర్వాత స్థానాల్లో డేనియల్ వెటోరి 362,  అండర్ వుడ్ 297, జడేజా 267, బిషన్ సింగ్ బేడీ 266 వికెట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: