వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య ప్రస్తుతం యాషెష్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ ను రెండు జట్లు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇక ఈ సిరీస్ లో గెలవడం కోసం హోరాహోరీగా పోరాడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంగ్లాండ్,  ఆస్ట్రేలియా మధ్య యాషెష్ సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని చెప్పాలి. నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్న ఈ రెండు జట్లు సిరీస్ గెలుచుకునేందుకు సర్వశక్తులు వొడ్డుతున్నాయి.


 అయితే ఆస్ట్రేలియా జట్టు మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లో ఎంతలా దూకుడు ప్రదర్శించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  అప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన జోరులో ఉన్న ఆస్ట్రేలియా.. యాషెష్ సిరీస్ లో కూడా ఇదే జోరును కొనసాగించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడిస్తూ మొదటి రెండు మ్యాచ్లలో విజయాన్ని సాధించింది. అయితే ఆస్ట్రేలియా జోరు చూస్తే మరో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను దక్కించుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని ఊహించని రీతిలో.. మూడో మ్యాచ్లో అనూహ్య విజయాన్ని సాధించింది.


 అయితే సిరీస్ ఎవరికీ కైవసం అవుతుంది అని తేల్చే నాలుగో సిరీస్ లో ఇంగ్లాండ్ మంచి ప్రదర్శన చేస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకరకంగా గెలిచే దిశగా ముందుకు సాగుతుంది. అయితే ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఘోర తప్పిదం చేసిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టివ్ వా తెలిపారు. ఒక స్పిన్నర్ ను కూడా తీసుకోకుండా ఆడటం సరికాదు అంటూ అభిప్రాయపడ్డాడు. మంచేస్టర్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని.. స్పిన్ తోనే ఇంగ్లాండును కట్టడం చేయొచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు. ఇక మర్ఫీని జట్టులోకి తీసుకొని ఉంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: