
అందుకే ఫాస్ట్ బౌలర్లు బంతులు వేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుని ఎంతో జాగ్రత్త పడుతూ బ్యాటింగ్ చేయడం చేస్తూ ఉంటారు ప్లేయర్లు. ఇక కొన్ని కొన్ని సార్లు ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఊహించని రీతిలో బంతి ఆటగాళ్లను గాయాలపాలు చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిలిప్స్ హ్యూస్ తరహాలోనే మరో క్రికెటర్ తల పగిలిపోయేది అని చెప్పాలి. కానీ అదృష్టవశాత్తు కొద్దిలో మిస్సయింది. ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది. ఇటీవలే ప్రారంభమైన కరేబియన్ సూపర్ లీగ్ లో భాగంగా ట్రైన్ బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ క్రమంలోనె సెయింట్ లూసియా బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ 12 ఓవర్ ను బ్రావో ఫుల్ టాస్ వేశాడు. అయితే ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న జాన్సన్ చార్లెస్ స్క్రూప్ షాట్ ఆడెందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్సై హెల్మెట్ కు బలంగా తగిలింది. బంతి తగిలిన వెంటనే కింద హెల్మెట్ కింద పడిపోయింది. అయితే చాకచక్యంగా హెల్మెట్ వికెట్లను తాకకుండా కాలితో అడ్డుకున్నాడు బ్యాట్స్మెన్. అంతా బాగానే ఉంది కానీ ఆ బంతి ఒకవేళ తలకు తగిలి ఉంటే మాత్రం చివరికి తల పగిలిపోయేది అని చెప్పాలి. కానీ అదృష్టవశాత్తు అతను ఎలాంటి గాయం కాకుండానే తప్పించుకో గలిగాడు.