అయితే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారి పోయింది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఇదే విషయం గురించి చర్చించుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడే కాదు ఎప్పుడూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన కూడా ఇరు జట్ల ఆటగాళ్ల ఆటను పోల్చి చూడడం సర్వదారణం గా జరుగుతుంటుంది. ఈ క్రమం లోనే బాబర్ సరిగ్గా ఆడతాడా లేదా కోహ్లీ అదర గొడతాడా అని కొంతమంది చర్చించుకుంటారు.
ఇక మరికొందరు పాకిస్తాన్ టీం లోని కీలక బోలర్ షాహీన్ ఆఫ్రిది ఇరగ దీస్తాడా లేదా బూమ్ బూమ్ బూమ్రా బుల్లెట్ లాంటి బంతులతో మెరుస్తాడా అని అందరూ చర్చించుకుంటారు. అయితే ఇక రేపు జరగబోయే మ్యాచ్ లో షాహిన్, బుమ్రాలలో ఎవరు మంచి ప్రదర్శన చేస్తారు అనే విషయం గురించి భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షాహిన్, బుమ్రా మధ్య అసలు పోలికే లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆఫ్రిది కంటే బుమ్రా చాలా ముందు ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య అసలు పోటీనే లేదు. ఆఫ్రిది కొత్త బంతితో అద్భుతాలు చేస్తాడు. కానీ బుమ్రా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అద్భుతాలు చేస్తాడు అంటూ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి