ఇటీవల కాలంలో ఎన్నో దేశాలలో క్రికెట్కు ఉన్న ఆదరణ రోజు రోజుకు పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఎంతో మంది యువకులు అటు క్రికెట్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే  క్రికెట్లో తీవ్రమైన పోటీ నెలకొంటుంది. అయితే భారత క్రికెట్ లో మాత్రమే కాదు ఇక ప్రతి చోట కూడా జట్టులో ఎంట్రీ ఇచ్చి తామేంటో నిరూపించుకున్న సీనియర్లు కొత్త ఆటగాళ్ల పోటీని తట్టుకునేందుకు ప్రతి మ్యాచ్ లో కూడా మళ్లీ కొత్తగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎవరైనా తమను తామును నిరూపించుకోవడంలో విఫలం అయ్యారు అంటే చాలు ఇక వారిని సెలెక్టర్లు నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 అంతేకాదు ఇక వరల్డ్ క్రికెట్లో యువ ఆటగాళ్ల హవా పెరిగిపోయిన నేపథ్యంలో ఎంతోమంది సీనియర్ క్రికెటర్ల కెరియర్ ప్రమాదంలో పడిపోతూనే ఉంది. దీంతో స్టార్ ప్లేయర్లుగా పేరు ఉన్నప్పటికీ  జట్టులో సరైన అవకాశాలు లేక కనుమరుగైపోతున్నారు ఎంతో మంది. చివరికి ఇలా వరుసగా అవకాశాలు వస్తాయని ఆశించడం.. చివరికి సెలక్టర్లు పక్కన పెట్టడంతో నిరాశ చెందడం జరుగుతూ వస్తుంది. దీంతో ఎంతోమంది క్రికెటర్లు తక్కువ వయసులోనే రిటైర్మెంట్ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటీవల వెస్టిండీస్ క్రికెటర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు.



 వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఇటీవల తెలిపాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన టీం లో తన పేరు లేకపోవడంతో బ్రావో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. దీంతో ఈ 34 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్క్రికెటర్ రిటర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. కాగా అతను ఇప్పటివరకు 56 టెస్టులు, 122 వన్డేలు, 26 t20 మ్యాచ్ లు ఆడాడు. అయితే ఇతని బ్యాటింగ్ స్టైల్ అచ్చం లెజెండ్ బ్రియాన్ లారాను తలపిస్తుందని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే అతను ఇలా సడన్గా రిటైర్మెంట్ ప్రకటన చేయడంతో ఫ్యాన్స్ అందరు కూడా షాక్ లో మునిగిపోయారు. అతను రిటైర్మెంట్ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: