
అతను ఆడిన ప్రతి మ్యాచ్ లోను ఏదో ఒక రికార్డు బద్దలు కొడుతూనే వచ్చాడు. ఇలా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించాడు. కాబట్టే విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. ఇక అందుకు తగ్గట్లు గానే ఇప్పటికీ కూడా అతని ఆట తీరు కొనసాగుతూ ఉంది. అయితే కోహ్లీ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కేవలం కొంతమంది క్రికెటర్లు మాత్రమే ఇలాంటి అరుదైన రికార్డులను సృష్టించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఏకంగా పసికూన టీం అయినా జింబాబ్వే జట్టులో ఆటగాడిగా కొనసాగుతున్న ఒక ప్లేయర్ ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇలా విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసింది ఎవరో కాదు.. జింబాబ్వే జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న సికిందర్ రాజా. ఇటీవల కింగ్ కోహ్లీ రికార్డులను సమం చేశాడు. 2023లో అత్యధికంగా 6 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకొని కోహ్లీ సరసన నిలిచాడు ఈ జింబాబ్వే ప్లేయర్. ఐసిసి టి20 వరల్డ్ కప్ ఆఫ్రికా రీజియన్ క్వాలిఫైర్ 2023లో రువాండాపై జరిగిన మ్యాచ్ లో సికిందర్ రజా ఈ రికార్డు సాధించాడు. ఇక డిసెంబర్ 6 లోపు అతను మరో ఏడు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండడంతో ఇక కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది అని క్రికెట్ విశేషకులు అంచనా వేస్తున్నారు.