మొన్నటికి మొన్న వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన బాధలో ఉన్న క్రికెట్ ప్రేక్షకులందరికీ ఇప్పుడు తమ ఆట తీరుతో కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది టీమిండియా. ఎందుకంటే ప్రస్తుతం ఇండియా వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో టి20 సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా టీమిండియా సీనియర్ ప్లేయర్లు అందరికీ కూడా రెస్ట్ ఇవ్వగా.. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇక యంగ్ ప్లేయర్స్ తో కూడిన భారత జట్టు బరిలోకి దిగింది. అయితే ఆస్ట్రేలియన్ టీంలో మాత్రం వరల్డ్ కప్ ఆడిన సీనియర్ ప్లేయర్లో ఉండడం గమనార్హం.


 ఈ క్రమంలోనే అయితే యంగ్ ప్లేయర్స్ తో ఉన్న అటు భారత జట్టు మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. ఇక ఇప్పటికే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా మూడు మ్యాచ్లు ముగియగా.. ఇక వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి సత్తా చాటింది టీం ఇండియా. ఇక భారత జుట్టు దూకుడు చూస్తే మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించి రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది అని అందరు అనుకున్నారు. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ను దెబ్బ కొట్టిన ఆస్ట్రేలియాను ఇక దెబ్బ కొడుతుంది అని ఊహించారు. కానీ ఊహించనీ రీతిలో అనూహ్యంగా పుంజుకున్న ఆస్ట్రేలియా.. మూడో మ్యాచ్లో విజయం సాధించింది.


 నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరింతంగా జరిగిన పోరులో చివరికి భారత జట్టుకు ఓటమి తప్పలేదు. మాక్స్వెల్ బ్యాటింగ్ విధ్వంసంతో ఇక భారత జట్టు చేసిన భారీ స్కోర్ కూడా చిన్నబోయింది. అయితే మూడో టి20 మ్యాచ్ లో ఓటమితో అటు టీమిండియా ప్రపంచ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో భారత విజయం సాధించి ఉంటే టి20 ఫార్మాట్ లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసేది. ఇప్పటివరకు 211 మ్యాచ్లలో భారత్ 135 విజయాలు అందుకుంది. 226 మ్యాచ్లలో పాకిస్తాన్ 135 మ్యాచ్ లలోనే పాకిస్తాన్ నెగ్గింది. అయితే మూడో టి20 లో గెలిచి ఉంటే 136 విజయాలతో వరల్డ్ రికార్డు సృష్టించేది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: