భారత జట్టులో సీనియర్లుగా ఇక టీమ్ ఇండియాను ముందుకు నడిపించే రెండు పిల్లర్లుగా కొనసాగుతూ ఉన్నారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు. ఒకప్పుడు కోహ్లీ ఎన్నో ఏళ్ల పాటు భారత్ జట్టుకి కెప్టెన్సీ వహిస్తే ఇప్పుడు కోహ్లీ నుంచి సారధ్య బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ మూడు ఫార్మట్లలో కూడా ఇక జట్టును కెప్టెన్ గా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి  అయితే ఇటీవల ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్  టోర్నీలో కూడా భారత జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు రోహిత్ శర్మ. ఇక ఫైనల్ లో ఓటమి తప్ప మిగతా అన్ని మ్యాచ్ లలో కూడా టీమిండియా ప్రదర్శనకు వంక పెట్టడానికి లేదు అని చెప్పాలి.

అయితే ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, రోహిత్ లకు విశ్రాంతి ప్రకటిస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇద్దరితో పాటు మరికొంతమంది కీలక ప్లేయర్లకు కూడా విశ్రాంతి ప్రకటించారు అని చెప్పాలి. అయితే ఈ క్రమంలోనే యంగ్ ప్లేయర్స్ తో కూడిన టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టి20 సిరీస్ ఆడుతుంది. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లబోతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే వన్డే టి20 సిరీస్ తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఆడబోతుంది. సౌత్ ఆఫ్రికా పర్యటనలో.. ఆడబోయే మూడు ఫార్మాట్ లకు సంబంధించిన జట్టు వివరాలను బీసీసీఐ ప్రకటించింది.


 కాగా వన్డే టి20 ఫార్మట్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ల పేర్లు లేకపోవడం చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఈ ఇద్దరు ప్లేయర్లు జట్టులో లేకపోవడం వెనక కారణమేంటి అన్న విషయాన్ని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసింది. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఈ పర్యటనలో లిమిటెడ్ ఓవర్స్ నుంచి విశ్రాంతి కావాలని కోరారు అంటూ బీసీసీఐ తెలిపింది. ఇక షమి వైద్య చికిత్స తీసుకుంటున్న కారణంగా కేవలం టెస్టులకు మాత్రమే ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చింది బిసిసిఐ. ఈ క్రమంలోనే బీసీసీఐ వివరణతో అటు అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: