భారత జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా గత కొంతకాలం నుంచి వార్తల్లో హాట్ టాపిక్గా మారిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసి వార్తల్లో నిలిచిన ఈ స్టార్ ఫేసర్.. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో జట్టు మారబోతున్నాడు అనే వార్తతో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయం గురించి చర్చించుకున్నారు. ఇప్పటికే హార్థిక్ పాండ్యా.. ఎవరు ఊహించిన విధంగా గుజరాత్ టైటన్స్ నూ వదిలేసి ముంబై ఇండియన్స్ లోకి వచ్చేసాడు అన్న విషయం తెలిసిందే.


 దీంతో ఇక ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ తర్వాత ఫ్యూచర్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యానే సారధ్య బాధ్యతలు చేపడతాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా జట్టులోకి రావడంతో ఏకంగా బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టును వీడి మరో టీం లోకి వెళ్ళబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. హార్దిక్ జట్టులోకి రావడంతో ఫ్యూచర్లో తనకు కెప్టెన్సీ దక్కదు అని నిరాశ చెందిన బుమ్రా మరో టీంలోకి వెళ్ళపోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయ్. అయితే ఇక ఈ వార్తలపై ఎంతో మంది మాజీలు కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పాలి.


 బుమ్రా ఎన్నో ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ను వీడబోతున్నాడు అని వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు  హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ లోకి రావడం బుమ్రాను బాధించి ఉండవచ్చు. ఎందుకంటే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది  రవీంద్ర జడేజా విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం త్వరగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దింది. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా బుమ్రా,  రోహిత్, హార్దిక్ తో మాట్లాడి పరిస్థితిని చక్క దిద్దాలి అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: