టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఎంత విజయవంతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను సారధ్య  బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అటు టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ అమాంతం పెరిగిపోయింది  అంతేకాదు మూడు ఫార్మాట్ లలో కూడా భారత జట్టును ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిపి రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ. అయితే గత కొంతకాలం రోహిత్ శర్మ టి20లకు దూరంగా ఉంటున్నాడు అనే విషయం తెలిసిందే   వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇక ఈ ఫార్మాట్ మీదే దృష్టి పెట్టేందుకు రోహిత్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు


 అయితే వన్డే వరల్డ్ కప్ ముగిసింది. టీం ఇండియా ఊహించిన ఫలితం మాత్రం రాలేదు. ఫైనల్లో ఓడిపోయిన భారత జట్టుకు  నిరాశ మిగిలింది. ఇక ఇప్పుడు 2024 t20 వరల్డ్ కప్ లక్ష్యంగా టీమ్ ఇండియా ముందుకు సాగుతుంది. దీంతో కొంతకాలం నుంచి టి20లకు దూరంగా ఉన్న రోహిత్ పొట్టి ఫార్మాట్ సారధ్య బాద్యతలు చేపట్టి జట్టులోకి వస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే గత కొంతకాలం నుంచి ఇదే విషయంపై చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.  రోహిత్ లేకపోవడంతో తాత్కాలిక కెప్టెన్ గా తరచు హార్దిక్ పాండ్యా చేతికి కెప్టెన్సీ అప్పగిస్తూ వస్తున్నారు సెలెక్టర్లు.



 ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి మాజీ క్రికెటర్ మాజీ బీసీసీఐ చైర్మన్ సౌరబ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన చేశాడు అంటూ కొనియాడాడు. ఇక టి20 లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండాలి అంటూ అభిప్రాయపడ్డాడు. రోహిత్ మంచి నాయకుడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుత టి20 లకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ లో కొనసాగుతున్నాడు అని గుర్తుచేసిన సౌరవ్ గంగూలీ.. t20 వరల్డ్ కప్ కి మాత్రం అటు రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగుతాడని భావిస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: