మొన్నటికి మొన్న ముగిసిన 2023 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఎంతలా స్వింగ్లో కనిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి మ్యాచ్ నుంచి సెమీఫైనల్ మ్యాచ్ వరకు కూడా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోయింది టీమిండియా. ఒక్క ఓటమి కూడా లేకుండా ప్రత్యర్థులపై పూర్తి ఆదిపత్యం సాధించింది అని చెప్పాలి. అయితే ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే ఈ ఓటమితో అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి.


 కాగా ఇప్పుడు టీమిండియా టి20 సిరీస్ లో ప్రదర్శన భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరిని కూడా ఇక ఈ ఓటమి బాధ నుంచి బయటపడేస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో సొంత గడ్డపై ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా. అయితే సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ప్రకటించడంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఆస్ట్రేలియాతో తలబడుతుంది. అయితే ఈ టి20 సిరీస్ లో ఫుల్ స్వింగ్ లో కనిపిస్తుంది టీం ఇండియా. వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి అదరగొట్టింది. ఇక మూడో మ్యాచ్లో ఓడిపోయింది. ఇక ఇటీవల జరిగిన నాలుగో మ్యాచ్లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.


 అయితే ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది టీం ఇండియా.. టి20 ఫార్మాట్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. 213 మ్యాచ్లో 136 విజయాలు సాధించింది భారత జట్టు  ఇక ఆ తర్వాత స్థానాల్లో పాకిస్థాన్ 226 మ్యాచ్లలో 135 విజయాలు, న్యూజిలాండ్ 200 మ్యాచ్లలో 102 విజయాలు, ఆస్ట్రేలియా 181 మ్యాచ్లలో 95 విజయాలు, సౌత్ ఆఫ్రికా  171 మ్యాచ్లలో 95విజయాలతో ఉన్నాయి. కాగా ఈ నాలుగో మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా అటు ప్రపంచ రికార్డు సృష్టించడమే కాదు అటు సిరీస్ ని కూడా కైవసం చేసుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: