
అయితే గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్ కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ వన్డే టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే సారధ్య బాధ్యతలను చూసుకుంటున్నాడు. ఇక తాత్కాలిక కెప్టెన్ అని చెప్పుకుంటున్నప్పటికీ హార్దిక్ పాండ్యాకు ఒకరకంగా పూర్తిస్థాయి టీ20 కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది అనడంలో సందేహం లేదు. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ మళ్ళీ పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలను చేపడితే బాగుంటుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ రోహిత్ మళ్లీ టి20 ఫార్మాట్లోకి వస్తాడా లేదా అనే విషయంపై కూడా అనుమానాలు నెలకొన్నా అని చెప్పాలి.
ఇక ఇదే విషయం గురించి టీమ్ ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పటాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మను ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్ గా చూసే అవకాశం లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ఇర్ఫాన్ పఠాన్. సౌత్ ఆఫ్రికా పర్యటనకు జట్ల ఎంపిక విధానం చూస్తే ఇలాగే అనిపిస్తుంది అంటూ అంచనా వేశాడు. సౌత్ ఆఫ్రికా పర్యటనలో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను ప్రకటించింది బీసీసీఐ. అయితే భవిష్యత్తులో ప్రతి ఫార్మాట్ కి కెప్టెన్ తో పాటు కోచ్ లు కూడా వేరువేరుగా ఉండే అవకాశం ఉంది అంటూ ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిణామం తనకు అస్సలు ఇష్టం లేదు అంటూ అభిప్రాయపడ్డాడు.