టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో సారధ్య బాధ్యతలు నుంచి తప్పుకున్న సమయంలో ఎంతటి వివాదం తెర మీదికి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే సారధ్య బాధ్యతలనుంచి తప్పించారు అంటూ విరాట్ కోహ్లీ అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీపై సంచలన ఆరోపణలు చేశాడు. ఇలా చెప్పకుండా కెప్టెన్సీ నుంచి తప్పించడం పై తీవ్ర అసంతృప్తి చెందాను అంటూ చెప్పడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే విరాట్ కోహ్లీ ఇలాంటి ఆరోపణలు చేసిన సమయంలో ఏకంగా జరిగిన విషయాలపై అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ విరాట్ కోహ్లీ చెప్పింది నిజం అని ఎంతోమంది ప్రేక్షకులు, అభిమానులు కూడా నమ్మడం మొదలుపెట్టారు. అయితే కోహ్లీని కాదని రోహిత్ శర్మకు టి20 కెప్టెన్సీ అప్పగించగా.. ఆ తర్వాత టెస్ట్ ఫార్మేట్  కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు విరాట్ కోహ్లీ  ఇప్పుడు మూడు ఫార్మాట్లకు రోహిత్ సారధిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఈ కెప్టెన్సీ వివాదం చెలరేగి ఎన్నో రోజులు గడుస్తున్నాయి.


 కానీ ఈ వివాదం ఇంకా ముగియలేదు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీని తప్పించడం గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీని తాను కెప్టెన్సీ నుంచి తొలగించలేదు అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. టి20 లకు కెప్టెన్సీ చేయడానికి విరాట్ కోహ్లీ ఆసక్తి చూపించలేదు. నీకు టి20 లలో కెప్టెన్సీ చేయడం ఇష్టం లేకపోతే మొత్తం వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిది అని సూచించా.. వైట్ బాల్, రెడ్ బాల్ క్రికెట్ కి వేరువేరు కెప్టెన్ లు ఉండడం బాగుంటుంది అని చెప్పాను. కానీ కోహ్లీ మాత్రం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: