2023 ఏడాది ముగియబోతుంది. ఇక ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ప్రతి ఒక్కరికి ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ముగింపుకు చేరుకున్న నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన మధురానుభూతులు అన్నింటిని కూడా అందరూ నెమరు వేసుకుంటున్నారు.  అయితే క్రికెట్ ప్రేక్షకులు కూడా ఇక ఏడాది ఎలాంటి ఎంటర్టైన్మెంట్ పొందామా అని గడిచిన రోజుల్లోకి ఒక్కసారిగా తొంగి చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే పలువురు క్రికెట్ విశ్లేషకులు ఆయా ఫార్మట్లలో ఈ ఏడాది మొత్తంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయాన్ని కూడా రివ్యూ రూపంలో చెప్పేస్తూ ఉన్నారు.


 ఈ క్రమంలోనే వరల్డ్ క్రికెట్లో ఉన్న అన్ని టీమ్స్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్ళను ఎంపిక చేసుకుని ఇక ఈ ఏడాది అత్యుత్తమ ప్లేయింగ్ ఎలవెన్ టీం ఏది అన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే క్రికెట్ విశ్లేషకులు పోస్ట్ చేస్తున్న ప్లేయింగ్  ఎలవెన్ టీమ్స్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఇటీవల ప్రముఖ వ్యాఖ్యాత హర్ష బోగ్లే కూడా ఇటీవలే 2023 బెస్ట్ ప్లేయింగ్ ఎలవెన్ జట్టును ప్రకటించాడు. అయితే హర్ష భోగ్లె ప్రకటించిన తన టెస్ట్ టీం లో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ లకు చోటు ఇవ్వకపోవడం గమనార్హం.


 టీమిండియా నుంచి కేవలం ఇద్దరు క్రికెటర్లకు మాత్రమే అతని ప్లేయింగ్ ఎలవెన్ లో చోటు దక్కగా.. ఇంగ్లాండ్ నుంచి అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు న్యూజిలాండ్ నుంచి ఇద్దరు చొప్పున ఇక  హర్ష బోగ్లే ప్లేయింగ్  ఎలెవెన్ లో చోటు సంపాదించుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హర్ష భోగ్లే ప్రకటించిన ప్లేయింగ్ ఏలెవెల్ టీం ను చూసి భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. వామ్మో ఈయన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలనే పక్కన పెట్టాడు. వాళ్లను మించిన ప్లేయర్లు ఇంకెవరైనా ఉన్నారా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్స్.


హర్ష భోగ్లే టెస్ట్ టీమ్ 2023 : ఉస్మాన్ ఖవాజా, జాక్ క్రాలే, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్

మరింత సమాచారం తెలుసుకోండి: