ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతోంది బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి ప్లేయర్లందరూ తరలివస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ టోర్నీ యువ ఆటగాళ్లకు ఒక మంచి వేదికగా మారిపోయింది. ఎంతోమంది కుర్రాళ్ళ జీవితాన్ని మార్చే ఒక వరంలా ఐపీఎల్ టోర్నీ ప్రస్థానం కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే గత రెండు సీజన్ల నుంచి ఐపీఎల్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది టాటా కంపెనీ. వాస్తవానికి 2021- 22 వరకే అటు టాటా కంపెనీ యొక్క స్పాన్సర్షిప్ కాంట్రాక్టు గడుగు ముగిసింది. కానీ బీసీసీఐ మరో ఏడాదిని పొడగిస్తూ 2023 ఐపీఎల్ సీజన్లో కూడా ఇక టాటా కంపెనీ నే స్పాన్సర్ గా కొనసాగించింది అని చెప్పాలి. ఇక ఇటీవల కొత్తగా స్పాన్సర్షిప్ కోసం బిడ్లను ఆహ్వానించింది బీసీసీఐ. కాగా మరోసారి టాటా సన్స్ అండ్ కంపెనీని ఇక ఐపీఎల్ యొక్క స్పాన్సర్షిప్ ను దక్కించుకుంది అన్నది తెలుస్తోంది. ఏకంగా మరో ఐదు సంవత్సరాల పాటు టాటా కంపెనీనే ఐపిఎల్ స్పాన్సర్ గా వ్యవహరించబోతుంది అన్నది తెలుస్తోంది.  ఇక ఈ కొత్త స్పాన్సర్షిప్ కోసం ఏకంగా 2500 కోట్లు చెల్లించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో సీజన్ కి 500 కోట్లు బీసీసీఐకి చెల్లించబోతుంది టాటా సన్స్ అండ్ కంపెనీ.


 గతంలో డ్రీం లెవెల్, వివో కంపెనీలు ఐపీఎల్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి అన్న విషయం తెలిసిందే. అయితే చైనా కంపెనీలను బ్యాన్ చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక చైనాకు చెందిన కంపెనీగా కొనసాగుతున్న వివో ను స్పాన్సర్షిప్ నుంచి బిసిసిఐ తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇకపోతే 2024 ఐపీఎల్ సీజన్ మార్చ్ మొదటి వారంలో ప్రారంభం కాబోతుంది అన్నది తెలుస్తుంది. ఇక అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో  ఇండియాలో ఈ టోర్నీ నిర్వహిస్తారా విదేశాలకు వేదికను మారుస్తారా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: