2024 ఐపిఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాడని అభిమానులు అందరూ కూడా అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆ జట్టు వరుసగా పేలవ ప్రదర్శనలు చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు ఈ ఐపీఎల్లో భాగంగా 6 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే విజయాన్ని సాధించింది. ఇక పాయింట్లు పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.


 అయితే ముంబై ఇండియన్స్ జట్టు ఇంత అద్వాన పరిస్థితుల్లో ఉండడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇకపోతే ఇటీవలే అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ మరో ఓటమిని చవిచూసింది. కాగా ఇక ఈ మ్యాచ్ లో ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ తో చలరేగిపోయాడు. 63 బంతుల్లో ఏకంగా 105 పరుగులు చేశాడు. ఇలా జట్టును గెలిపించేందుకు రోహిత్ సెంచరీ చేసి వీరోచిత పోరాటం చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ మాత్రం విజయం సాధించలేకపోయింది అన్న విషయం తెలిసిందే.



 అయినప్పటికీ రోహిత్ తన సెంచరీ తో అభిమానుల మనస్సు గెలుచుకున్నాడు. కానీ ఇలా చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిపోయిన రోహిత్ పై విమర్శలు వస్తూ ఉన్నాయి. రోహిత్ సెంచరీ కోసమే ఆడాడని జట్టు విజయం కోసం ప్రయత్నించలేదు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. సెల్ఫిష్ అంటూ ఒక హాష్ ట్యాగ్నెట్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే రోహిత్ ఒక్కడే నిలబడిన మిగతా ప్లేయర్ల నుంచి సహకారం అందలేదని.. అతని ఫ్యాన్స్ ఇలా రోహిత్ సెంచరీ పై  విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ ఇస్తున్నారు. చివర్లో రోహిత్ కి స్ట్రైకింగ్ కూడా సరిగ్గా రాలేదని.. దానికి అతనేం చేస్తాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు రోహిత్ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl