2019లో మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నాటి నుంచి కూడా ధోని ఐపీఎల్ కెరియర్ పై ఎన్నో వార్తలు వస్తున్నాయ్. ఐపీఎల్ కెరియర్ కు కూడా ధోని రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అంటూ ఇక ప్రతి సీజన్ కి ముందు వార్తలు తెరమీదకి రావడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఈ వార్తలన్నింటికీ కూడా చెక్ పెడుతూ.  ధోని అటు ప్రతి సీజన్లో కొనసాగుతూనే వస్తున్నాడు. కానీ ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ ధోని కి చివరిది అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.


 ఎందుకంటే 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ధోని సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రుతురాజుకి  సారధ్య బాధ్యతలను అప్పగించాడు. ఇక ఈ సీజన్లో జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ రుతురాజుకి కెప్టెన్సీ లో ఎన్నో మెలకువలు కూడా నేర్పించాడు. దానికి తోడు చెన్నైలోనే చపాక్ స్టేడియంలో ఆడిన చివరి మ్యాచ్లో మైదానం చుట్టూ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశాడు. అయితే రిటైర్మెంట్ చేసిన సమయంలోనే ఆటగాళ్లు ఇలా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  ఇక ఇవన్నీ చూసుకుంటే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని అందరు ఫిక్స్ అయిపోయారు.


 అయితే ఇదే విషయంపై అటు చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడతారా లేదా అనే ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము గౌరవిస్తాం. సరైన సమయంలోనే మహి నిర్ణయం తీసుకుంటారు. కానీ ధోని వచ్చే సీజన్లో ఆడతారని మేము ఆశాభావంతో ఉన్నాం  అభిమానులు కూడా ఇదే కోరుకుంటారు అంటూ విశ్వనాథన్ చెప్పుకొచ్చారు. అయితే విశ్వనాథన్ చెప్పినట్లుగానే ధోని వచ్చే సీజన్లో ఆడితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు అని మహి ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: