బెస్ట్ ఫినిషర్ గా, బెస్ట్ వికెట్ కీపర్ గా కూడా వరల్డ్ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే ఈ రేంజ్ లో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు కాబట్టే ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్న ఇంకా అతని క్రేజ్ మాత్రం ఇసుమంతైన తగ్గడం లేదు. అది సరేగాని ఇప్పుడు ధోని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా. ధోని రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని గొప్ప క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. అయితే ఇక ఇప్పుడు ఒక అథ్లెట్ కూడా ఇలాగే ధోని లాంటి గతాన్ని కలిగి ఉన్నాడు.
ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ గా సాగుతున్న పారిస్ ఒలంపిక్స్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరాడు అన్న విషయం తెలిసిందే. అయితే అతను కూడా ధోని లాగానే కెరియర్ ఆరంభంలో రైల్వే టికెట్ కలెక్టర్ గా పని చేశారు. ఇక తర్వాత కాలంలో షూటింగ్ విభాగంలో 2012 నుంచి రాణిస్తూ.. ఇక ఇప్పుడు పథకానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. కాగా అతని తండ్రి టీచర్ గా పని చేస్తూ ఉండగా.. తల్లి ప్రస్తుతం సర్పంచ్గా కొనసాగుతున్నారు. అయితే ధోని బయోపిక్ ఎన్నోసార్లు చూశానని.. ఇక ధోని లాగానే ఒత్తిడి సమయంలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను అంటూ గతంలో ఓ సమయంలో చెప్పుకొచ్చాడు స్వప్నిల్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి