అయితే అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మాత్రం అటు టిడిపి ప్రభుత్వ తప్పులు ఏమైనా దొరుకుతాయా అని.. ఎంతో ఆతృతక ఎదురుచూస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఏదైనా తప్పు దొరికితే ఇక అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి మాత్రమే కాదు ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత చిక్కుల్లో పడేస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలకమైన తీర్పును ఇచ్చింది. ఇలాంటి సమయంలో ఎస్సీ వర్గీకరణ పై గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీని ఇరకాటంలో పడేసాయి అని చెప్పాలి.
ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని కోర్టులో కొట్టివేస్తారని తెలిసే.. చంద్రబాబు ఇలా వర్గీకరణ చేసి వారి మధ్య చిచ్చు పెట్టారు అంటూ గతంలో సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు జగన్. అయితే జగన్ చేసిన పని ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఆయన మాటలు ఆయనకే తగులుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ అసాధ్యమని జగన్ చెప్పగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ తీర్పు అటు వైసీపీకి అస్సలు మింగు పడని అంశంగా మారింది. ఎందుకంటే దళిత వర్గాలు ఇప్పటికే జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉంటే ఇక ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఆయన వ్యతిరేకం కావడం మరింత మైనస్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే వైసిపి సుప్రీంకోర్టు తీర్పును కూడా పూర్తిస్థాయిలో స్వాగతించలేదు. ఇక ఇప్పటి లాగానే అడ్డగోలు వాదన చేసి మళ్ళీ ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ రానున్న రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు పైన వైసిపి రాజకీయం చేస్తే.. దళిత వర్గాలు ఆ పార్టీకి పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి