సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురుగా సారా టెండూల్కర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ భామ హీరోయిన్ కి మించిన అందం, ఫిట్నెస్ కొనసాగిస్తోంది. సారా టెండూల్కర్ ఎలాంటి సినిమాలలో నటించినప్పటికీ తనకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా వేదికగా సారాకు మిలియన్ల కొద్ది ఫాలోయింగ్ ఉండడం విశేషం. సారా టెండూల్కర్ కు బయట కూడా విపరీతంగా అభిమానులు, ఫ్యాన్ పేజీలు ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా సారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. 

సమయం దొరికినప్పుడల్లా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడ తీసుకున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ అవుతాయి. అంతేకాకుండా సారా పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. ఇక సారా టెండూల్కర్ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే.... ప్రముఖ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో సారా టెల్ డేటింగ్ లో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు తెరపైకి వచ్చాయి. వీరిద్దరూ చాలా కాలం నుంచి సీక్రెట్ గా ప్రేమలో ఉన్నట్లు, డేటింగ్ లో ఉన్నట్లు అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి.


అంతేకాకుండా సారా టెండూల్కర్, శుభ్ మన్ గిల్ చాలా సందర్భాలలో బయట రెస్టారెంట్లలో, పార్టీలలో, పబ్బులలో కలిసినట్లుగా కొన్ని ఫోటోలు, వీడియోలు సైతం బయటకు వచ్చాయి. వీరిద్దరూ ఇన్ స్టాలో ఒకరినొకరు ఫాలో అవుతుండడం విశేషం. అంతేకాకుండా వీరు పోస్ట్ చేసే ఫోటోలకి ఒకరికొకరు లైక్స్, కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వార్తలపై సారా టెండూల్కర్, గిల్ ఇంతవరకు స్పందించలేదు. రీసెంట్ గానే గిల్ ఐ యామ్ సింగిల్ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇక గత కొద్దిరోజుల నుంచి గిల్, సారా విడిపోయినట్టుగా అనేక రకాల వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా వీరిద్దరికి సంబంధించి మరో వార్త హాట్ టాపిక్ గా మారుతుంది.


గిల్ బాలీవుడ్ నటి అవనీత్ కౌర్ తో రిలేషన్ కొనసాగిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సారా టెండూల్కర్ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో రిలేషన్ లో ఉన్నట్టుగా బాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. గిల్ ఆడేటువంటి మ్యాచ్ లకు అవనీత్ హాజరవుతున్నట్టుగా సమాచారం. ఇక సారా టెండూల్కర్ సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి పార్టీలకు వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై గిల్, సారా ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: