ఈ రోజున భారత్ క్రికెట్ లో అత్యంత ఫేమస్ ఆటగాళ్లలో ఒకరుగా పేరు సంపాదించిన మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు రకాల ఫోటోలను ,విషయాలను కూడా వైరల్ గా చేస్తున్నారు. ఈ రోజున ధోని 44వ పుట్టినరోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కెప్టెన్ కూల్ గా పేరు సంపాదించిన ధోని క్రికెట్ స్టేడియంలో అడుగు పెడితే చాలు ఆయన అభిమానులు చేసే రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే ఉండే క్రికెటర్లలో అత్యంత ధనవంతులలో  ఒకరిగా పేరు సంపాదించారు ధోని.


రాంచీలో  ఒక సాధారణ కుటుంబం నుంచి ధోని క్రికెట్ ప్రయాణం మొదలయ్యింది.. 2004లో అంతర్జాతీయ క్రికెట్ తో ఎంట్రీ ఇచ్చిన ధోని అప్పటినుంచి ధోని ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు.. 2007లో T-20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్ అలాగే 2013లో ఛాంపియన్ ట్రోఫీతో భారత దేశంలో ఎన్నో అద్భుతమైన విజయాలను అందించేలా చేశారు. ఇక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐదో టైటిల్ ని సంపాదించిన రికార్డును అందుకున్నారు.


అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చిన ధోని సంపాదనలో కూడా భారీగానే ఉన్నది.  అయితే కొన్ని నివేదికల ప్రకారం.. ధోని మొత్తం నికర ఆస్తి విలువ 120 యూఎస్ డాలర్లు ఉన్నదట.. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 కోట్ల రూపాయల వరకు ఆస్తి ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు 18 ఐపిఎల్ సీజన్ లో ఆడిన ధోని సుమారుగా 200 కోట్లకు పైగా సంపాదించారు. అలాగే కొన్ని రకాల బ్రాండ్స్ ద్వారానే కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. ఈ ఏడాది చివరి నాటికి ధోని బ్రాంచ్ విలువ 803 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ధోని వ్యాపారం లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.. అటు సినీ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ,ఫ్యాషన్ ఇలా ఎన్నో రకాల వాటిలో పెట్టుబడి పెట్టారు. అలాగే ధోని దగ్గర కొన్ని కోట్ల విలువైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి వీటన్నిటి విలువ సుమారుగా 150 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. అలాగే పొలాలు వంటివి కూడా చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: