బిగ్ ‌బాస్ సీజన్ 4 రియాలిటీ షో చివరి వారానికి వచ్చేసింది. ఆట మరింత రసవత్తరంగా మారింది... టాస్క్ ల మీద టాస్క్ లు ఇస్తూ మరింత ఉత్కంఠను పెంచుతున్నారు. మెడల్ ను గెలుచుకొని టాప్‌ 5 లో చోటు దక్కించుకునేందుకు అఖిల్, సోహెల్ పోటీ పడుతున్నారు. టాప్ ఫైవ్ లోకి ప్రవేశించాలంటే ఉయ్యాలపై నుండి లేవకూడదు అంటూ టాస్క్‌ను ఇచ్చారు బిగ్ బాస్. అయితే టాస్క్‌లో భాగంగా పాలు తాగాలని... ముల్లంగి జ్యూస్ తాగాలని ట్విస్టులు ఇచ్చారు బిగ్ బాస్. అయినా సరే పోటీలో నెగ్గేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు అఖిల్ మరియు సోహెల్.

 అయితే సోహెల్, అఖిల్ పట్టు వదలని విక్రమార్కుడిలా ఇద్దరు గేమ్‌ను అర్ధరాత్రి వరకు కొనసాగించారు. దాంతో ఇంటి సభ్యులు కూడా నిద్ర పోకుండా టాస్క్‌ లో వారికి తోడుగా మేల్కొని ఉండాలని బిగ్ బాస్ ఆదేశించడంతో ఇంటి సభ్యులు కూడా వారితో జాగారం చేశారు.
ఇదిలా నడుస్తుండగా.... అవినాష్ మరియు మోనాల్  మధ్య ఒక చిలిపి సంఘటన జరిగింది. అభిజిత్, హారిక, అరియానా, మోనాల్ మాట్లాడుకుంటున్న సందర్భంలో అవినాష్  రాగానే మోనాల్ ని అన్న అని పిలవమన్నారు.

ఖంగుతిన్న అవినాష్ వద్దమ్మా మోనాల్ వద్దు..... నేను నీకు బ్రదర్ ఏంటి తల్లి... మనం మంచి ఫ్రెండ్స్ కదా... ఫ్రెండ్ అని చెప్పు అంటూ కామెడీ చేశాడు. ఛీ ఒక హీరోయిన్ అయ్యుండి నన్ను అన్నా అనడానికి ప్రయత్నిస్తావా అంటూ సందడి చేశాడు. ఈ సన్నివేశంలో వీరిమధ్య జరిగిన సంభాషణ కామెడీ పండించి అందరిని నవ్వించింది...... ఇలా ఇంటి సభ్యుల మధ్య సరదా సన్నివేశాలు జరుగుతుంటే... సోహైల్ అఖిల్ మాత్రం ఓ వైపు వీటిని ఎంజాయ్ చేస్తూనే మరో వైపు ఉయ్యాల నుండి దిగలేక ఉండనూ లేక సంతోషంగా ఇబ్బంది పడుతూనే టాస్క్ ని కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: