టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచు వారి ఫ్యామిలీకి ప్రత్యేకమై న గుర్తింపు ఉంది... ఈ ఫ్యామిలీ నుంచి మొదట మోహన్ బాబు టాలీవుడ్ లో స్టార్ గా ఉండగా ఆ తర్వాత ఆయన ముగ్గురు వారసులు ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా వీళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు సెటిల్ కాకపోవడం గమనార్హం.. మంచు విష్ణు హీరోగా కొనసాగుతున్నా, వరుస సినిమాలు చేస్తూన్న హిట్ రాకపోవడంతో మంచి హిట్ కోసం ఇప్పటి కీ ఎదురు చూస్తూనే ఉన్నాడు..

ఇటు మంచు మనోజ్ కెరీర్ కూడా ఏమంత బాగాలేదు.. ఆయన తన తొలి సినిమా నుంచి వైవిద్యం  ప్రదర్శించాల ని చూసిన ఆ సినిమాలు బెడిసి కొట్టడంతో దారుణమైన ఫలితాలు మిగిల్చాయి.. మధ్యలో కొన్ని రోజులు రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ వర్కౌట్ అవ్వక మళ్ళీ సినిమాల బాట పట్టాడు ఇప్పుడు.. ఓ పాన్ ఇండియా చిత్రంలో ఇప్పుడు మంచు మనోజ్ నటిస్తుండగా ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తా అంటన్నాడు ..ఇదిలా ఉంటే తమ ఇంట్లో ఐపీఎల్ కారణంగా గొడవలు జరుగుతున్నాయని మంచు మనోజ్ తాజాగా పెట్టి న ఓ పోస్ట్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది..

అందుకు కారణం తన కూతుళ్లు ఆరియానా, వివియానా అని మంచు విష్ణు తెలిపాడు.. వీరిద్దరూ ఐపీఎల్ మ్యాచ్ ను తెగ చూస్తున్నారట.. అందు లో అరియనా కి ధోని అంటే ఇష్టమట.. వివియాన కు కోహ్లీ అంటే ఇష్టమట.. దీంతో చెన్నై, బెంగళూరు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇంట్లో ప్రపంచ యుద్ధం అని వెల్లడించాడు.. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు ఎంతో రసవత్తరంగా సాగుతు న్న విషయం తెలిసిందే.. బయట కూడా ఇలాంటి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చిన్న పిల్లలు అయినటువంటి వీరిద్దరూ అ లా  చేయడం లో ఎలాంటి తప్పు లేదని కామెంట్లు పెడుతున్నా రు నెటిజెన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: