ప్రముఖ దర్శకుడు రామానంద్‌ సాగర్‌ రూపొందించిన అపురూప దృశ్య కావ్యం ‘రామాయణ్‌’ 1987 జనవరి 25 నుంచి జులై 31 1988 వరకు దూరదర్శన్ ఛానల్ లో ప్రసారం అయ్యింది. రామాయణ్‌ టీవీ సీరియల్ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. అయితే రామాయణ్‌ టీవీ సీరియల్ 1987 కాలంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అప్పట్లో ఈ సీరియల్ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా రూపొందించారు.


అయితే అప్పటి ప్రేక్షకులు రామాయణ్‌ వంటి ధారావాహిక చూస్తారా లేదా అనే విషయం పట్టించుకోకుండా సీరియల్ బృందం చాలా రిస్క్ చేసిందనే చెప్పాలి. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ ప్రేక్షకులకు బీభత్సం గా నచ్చేసింది. మొట్ట మొదటి ఎపిసోడ్ తోనే బుల్లితెర రంగం లో రామాయణ్‌ సీరియల్ సంచలనం సృష్టించింది. దీనితో ఊహించని విజయం తో దూరదర్శన్ టీవీ చాలా డబ్బులు సంపాదించింది. 1987వ సంవత్సరం లోనే రామాయణ్‌ ధారావాహిక దూరదర్శన్ చానల్ కి 40 లక్షల రూపాయలు సంపాదించి పెట్టింది. దాదాపు 35 ఏళ్ల క్రితం ఒక టీవీ సీరియల్ 40 లక్షల రూపాయలు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు.



ఇకపోతే కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో రామాయణ్‌ సీరియల్ ని దూరదర్శన్ టీవీ యాజమాన్యం మళ్లీ పునః ప్రసారం చేసింది. కరోనా సమయంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఇంటి నుండి బయటకు పోకుండా చేయాలన్న ఉద్దేశంతో రామాయణ్‌ సీరియల్ ని మళ్లీ ప్రసారం చేశారు. అయితే పెద్ద వారు మాత్రమే కాదు యువత కూడా రామాయణ్‌ ధారావాహిక ను చూసి బాగా ఎంజాయ్ చేశారు. 2020 సంవత్సరం లో రామాయణ్‌ సీరియల్ కి సంబంధించి ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. దీంతో దూరదర్శన్ ఛానల్ వ్యూయర్ షిప్ విపరీతంగా పెరిగిపోయి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: