బిగ్ బాస్ రోజులు గడిచే కొద్దీ ఎంటర్ టైన్మెంట్ డోసు కూడా పెరుగుతోంది. ముఖ్యంగా రోజుకి ఒక గొడవ ను స్క్రిప్ట్ లో రాసుకున్నట్టున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. ఈ వారం బిగ్ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనే విషయం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఎప్పటి లాగే ఈ వారం కూడా ఎలిమినేట్ కాబోయేది వారే అంటూ గాసిప్ లు ఊపందుకున్నాయి. అందులో ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరి ప్రియ కాగా మరొకరు బస్తీ స్టార్ లోబో. వీరిద్దరూ మొదటి నుండి గేమ్ ల పైన ఆటపైన కాకుండా ఇతర అంశాలపై శ్రద్ద చూపించారు. ప్రియ ముఖ్యంగా ఇంట్లో జరిగే గొడవలు మరియు ఇంటి సభ్యుల మధ్య జరిగే అటాచ్మెంట్ ల గురించి  గాసిప్ లు చేస్తూ వచ్చారు.

అంతే కాకుండా లహరి విషయంలోనే మాట్లాడిన మాటలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను కలిగించాయి. మామూలుగా ఆ వారమే ఎలిమినేట్ అయ్యేది. కానీ ఎందుకో బిగ్ బాస్ లహరిని పంపేశాడు. తర్వాత వారం రవితో గొడవ పెట్టుకుంది. అంతే కాకుండా సన్నీతో మొదటి వారం నుండి కోపం పెట్టుకుంది.  నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా ప్రియా  నానా హంగామా చేసింది. సన్నీ తో కావాలని గొడవ పెట్టుకుంది. ఇలా కొన్ని విషయాలు ప్రేక్షకుల్లో వ్యతిరేకతను పెంచాయి. ఇక లోబో విషయానికి వస్తే, ఎంటర్టైన్మెంట్ తప్ప ఇంకో దగ్గర లోబో కనిపించలేదు. డబుల్ స్టాండర్డ్స్ ఎక్కువగా కనిపించాయి.

గత వారం షాకింగ్ ఎలిమినేషన్ కొంతలో అయ్యేది. కానీ బిగ్ బాస్ సీక్రెట్ రూం లో పెట్టి మరో అవకాశం ఇచ్చారు. అయితే ఈ రోజు ఇంటిలోకి అడుగు పెట్టనున్నాడు. వీరిద్దరిలో ఒకరు ఈ వారం హౌజ్ నుండి బయట వెళ్లిపోవడం ఖాయం. మరి ఏమి జరగనుంది అని తెలియాలంటే ఇంకో మూడు రోజుల వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: