బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే.. బాగా పాపులర్ అయినటువంటి నటులలో జబర్దస్త్ వర్ష కూడా ఒకరు. మొదట తన కెరీర్ని మోడలింగ్ వైపు నుంచి ప్రారంభించి.. ఆ తర్వాత బుల్లితెరపై అడుగులు వేసింది. అలా ఎన్నో సీరియల్స్ లో కూడా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేకపోయింది ఈమెకు. కానీ జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత.. ఆమేకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఇక జబర్దస్త్ లో ఇమాన్యుల్ కి జోడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అంతేకాకుండా కొన్ని షోలతో చాలా బిజీగా మారిపోయింది వర్ష. ప్రస్తుతం తన సోషల్ మీడియా నుంచి ఒక ఎమోషనల్ పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అవుతోంది.

వర్ష తన కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకి మాత్రం కాస్త తన సమయాన్ని కేటాయిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు తన అందమైన ఫోటోలు షేర్ చేస్తూ ఉండే వర్ష ఈసారి మాత్రం ఒక చేదు ఘటనను షేర్ చేసింది.. అదేమిటంటే తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా తెలియజేసింది వర్ష. హాస్పిటల్లో రక్తపుమడుగులో తన సోదరుడు ఉన్నటువంటి కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అలా షేర్ చేస్తూనే.. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని అందరినీ వేడుకుంటోంది.కేవలం ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యం కారణంగా తన సోదరుడు ఇలా యాక్సిడెంట్ అయి హాస్పటల్లో ఉన్నాడంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. దీంతో తన ఫ్యామిలీ అంతా ఎంతో బాధపడ్డామని తెలియజేసింది అందుచేతనే డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కేర్ ఫుల్ గా డ్రైవ్ చేయాలని తెలియజేసింది.ప్రస్తుతానికి తన సోదరుడి ఆరోగ్యం కుదుటగానే ఉందని తెలియజేసింది వర్ష.ప్రస్తుతం జబర్దస్త్ ఏ కాకుండా ఇతర స్పెషల్ ఈవెంట్ లో కూడా సందడి చేస్తూ ఉంటుంది వర్ష. తనకి కామెడీ చేయడం రాకపోయినా సరే తన అందంతో బాగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: