బుల్లితెరపై సుడిగాలి సుదీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు సుదీర్ బుల్లితెరపై స్టార్ గా దూసుకుపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు వెండితెర పైన కూడా హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హీరోగా ఆల్రెడీ మూడు సినిమాలు విడుదలయ్యాయి మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక గతంలో హీరోగా నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం హీరోగా కొన్ని సినిమాలలో చేస్తూ ఉండడంవల్ల బుల్లితెర పైన కాస్త గ్యాప్ ఇస్తూ వస్తున్నాడు సుధీర్. గతంలో అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, ఎక్స్ట్రా జబర్దస్త్ ఇలా అన్ని బాగానే చేస్తూ ఉండేవారు ఇప్పుడు అవన్నీటిని మానేశారు అందుకు గల కారణం సమయం దొరకకపోవడం వల్లే ఈటన్నిటిని మానేసి స్టార్ మా లో కేవలం సింగిల్ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.అలా ఈటీవీ నుంచి స్టార్ మాకు మారడంతో తన పైన ఎన్నో గాసిప్స్ కూడా వచ్చాయి మల్లెమాలతో విభేదాలని ఇంకెప్పుడు కూడా ఈటీవీలో కనిపించారనే వార్తలు కూడా వినిపించాయి దీంతోపాటు రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, సుధీర్ మధ్య స్నేహం కూడా చెడిపోయింది అని కొలుసార్లు రూమర్లు వినిపించాయి. అంతేకాకుండా రామ్ ప్రసాద్ ఒక్కడే కొన్నిసార్లు స్కిట్లు చేయడం జరిగింది. అయితే గడిచిన వారం నుంచి గెటప్ శ్రీను జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో కాస్త ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు కానీ సుధీర్ కనిపించలేదని మరికొంతమంది చాలా ఫీలవుతున్నారు.

అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ నుంచి సుధీర్ పరోక్షంగా ఒక పోస్ట్ చేయడం జరిగింది.. నా బలం నా సంతోషం అంతా కూడా వీళ్లే మేము ఎంత దూరంలో ఉన్నా కూడా.. ఎక్కడ ఉన్నా సరే మా బంధం ఎప్పటికీ ముగిసిపోదనే విషయాన్ని తెలియజేశారు సుదీర్. దీంతో ఇకపైన వీరి ముగ్గురు ఒకేసారి కనిపించే అవకాశం ఉండదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: