బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటి వరకు అయిదు సీజన్ లను పూర్తి చేసుకుంది. కాగా మూడు వారాలు క్రిందటే బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇది కూడా సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. అయితే మొదటి వారం ఎవ్వరినీ నామినేట్ చేయని బిగ్ బాస్, రెండవ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత గత రాత్రి నేహా బిగ్ బాస్ హౌజ్ నుండి అతి తక్కువ ఓట్లు రావడం కారణంగా ఎలిమినేట్ అయింది. అయితే ఎలిమినేషన్ అయ్యి స్టేజ్ మీద మాత్రం నాగ్ సార్ తో నా ఎలిమినేషన్ కి కారణం మాత్రం వారిద్దరే అంటూ కామెంట్ చేసి వెళ్ళింది. వాస్తవంగా ఇంటి నుండి వెళుతోంది కాబట్టి బాధ ఉండడం సహజం.

కానీ తన ఓటమికి మిగిలిన వారిని కారణంగా చూపించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని నెటిజన్లు అంటున్నారు. అయితే నేహా చెబుతున్న ప్రకారం  రేవంత్ మరియు వాసంతి ల వలనే నేను నామినేషన్ లోకి వచ్చానని వారిపై రుద్దే ప్రయత్నం చేసింది. ప్రతి వారం బిగ్ బాస్ సోమవారం రోజున నామినేషన్ పెడతారు. కానీ నామినేషన్ చేసినంత మాత్రాన ఎలిమినేట్ కారు కదా ? మన ఆటతీరు బాగుంటే ప్రేక్షకులే ఓట్ల రూపంలో మనల్ని సేవ్ చేస్తారు. అంతే కానీ మన ఆటలో ఏ విధమైన ఎఫర్ట్ పెట్టకుండా ఉంటే ప్రేక్షకులు ఓట్లు ఎలా వేస్తారు. వారం మొత్తం ప్రసారం అయ్యే బిగ్ బాస్ ను చాలా జాగ్రత్తగా చిన్న పాయింట్ ను కూడా వదలకుండా చూస్తారు.

సదరు కంటెస్టెంట్ చేసిన ప్రదర్శనను బట్టే ఓటింగ్ ఉంటుంది, అలా నేహా నామినేషన్ లో ఉన్న అందరి కంటే కూడా తక్కువ ఓట్లు తెచ్చుకున్న కారణంగా ఎలిమినేట్ అయింది. పైగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమెకు ఎక్కువగా సోషల్ మీడియా ఫాలోయింగ్ లేకపోవడం కూడా ఒక కారణం అంటూ వినబడుతోంది. కాబట్టి మన ఓటమికి మరొకరిని కారణంగా చూపడం ముమ్మాటికి తప్పే.

మరింత సమాచారం తెలుసుకోండి: