ప్రముఖ గ్లామర్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో మరింత మందిని ఆకట్టుకుంటున్న ఈమె తన కెరీర్ ను మొదటిసారి న్యూస్ రీడర్ గా మొదలుపెట్టి.. ఆ తర్వాత యాంకర్ గా జబర్దస్త్ లో అవకాశాన్ని దక్కించుకుంది. జబర్దస్త్ స్టేజ్ పై తన అందంతో నటనతో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె అక్కడ గ్లామర్ షో చేసి అంతకుమించి అవకాశాలను సొంతం చేసుకుంది. జబర్దస్త్ లో వచ్చిన పాపులారిటీతో సినిమాలలో అవకాశాలు దక్కించుకొని అక్కడ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలలో కూడా అవకాశాలు దక్కించుకున్న అనసూయ వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. అంతేకాదు దాదాపుగా ఈమె నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధిస్తూ ఉంటే అవకాశాలు కూడా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అనసూయ తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది.  అలాగే ఒక్కోసారి నెటిజన్స్ ట్రోల్స్ కి కూడా గురవుతూ ఉంటుంది. ఇకపోతే ఈమెకు భారీ క్రేజ్ ఉన్న నేపథ్యంలో అప్పుడప్పుడు జువెలరీ షాప్ ఓపెనింగ్ కూడా వెళ్లే ఈ ముద్దుగుమ్మ ఈసారి కూడా నంద్యాలలో జరిగిన ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది.


అక్కడ షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత ఏర్పాటుచేసిన స్టేజ్ పై డాన్స్ కూడా వేసింది. అనంతరం అభిమానులతో ముచ్చటించిన ఈమే కొంతమందితో సెల్ఫీలు కూడా దిగింది. ఇక మళ్ళీ షాప్ లోకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన చీరలను చూసి మురిసిపోయింది అనసూయ. అనంతరం బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అభిమానులు ఆమెను జబర్దస్త్ నుంచి ఎందుకు వచ్చేశారు అంటూ ప్రశ్నించారు.. దానికి సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. జబర్దస్త్ లో కామెడీగా, సినిమాలలో సీరియస్ క్యారెక్టర్లు చేసేసరికి కొంతమంది నన్ను చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదని జబర్దస్త్ మానేశాను అని చెప్పింది. మొత్తానికి అయితే ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: