తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి డ్యాన్స్ షో ఢీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే... ఈ షో ఎన్నో సీజన్లు సైతం విజయవంతంగా పూర్తి చేసుకున్నది.ఇటీవల సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు మల్లెమాల సంస్థ తీసుకురావడం జరిగింది. కానీ ఈసారి బుల్లితెరపై నటించిన కొంతమంది నటీనటులను డాన్సర్ గా పరిచయం చేయడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఢీ సెలబ్రేషన్స్ ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.


ఎపిసోడ్ కి సుమ అతిథిగా హాజరయ్యారు. అలాగే తన కొడుకు రోషన్ కనకాల తో పాటు హీరోయిన్ మానస చౌదరి కూడా ఇందులో అతిథులుగా వచ్చారు. ఇటీవల సుమ కొడుకు నటించిన బబుల్ గమ్ చిత్రం విడుదలై మిక్స్డ్ టాకును తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నటీనటులు ఇద్దరూ ఢీ షో కి హాజరయ్యారు.అయితే ఇందులో శ్వేత నాయుడు అనే కంటెస్టెంట్  మ్యాడ్ చిత్రంలో ఒక సాంగ్ కి అదిరిపోయే విధంగా డాన్స్ వేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా నోటిలో నీళ్లు పోసుకుని మళ్లీ కుమ్మేస్తూ ఉన్నట్టుగా ఒక డ్యాన్స్ మూమెంట్ ని చేసి అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది.

అయితే ఈ డాన్స్ మూవ్మెంట్ పైన సుమ చాలా ఫన్నీగా కామెంట్స్ చేసింది.. ముఖ్యంగా మీరు చేసింది ఏమిటి నేను చెప్పిందేమిటి అంటూ కాస్త ఈ డాన్స్ విషయంలో కలుగజేసుకోవడంతో హైపర్ ఆది వెంటనే రియాక్ట్ అవుతూ సుమ గారు ఆ స్టెప్పులు వేస్తారంటూ చెప్పగా దీంతో సుమ డాన్స్ చేయడానికి నోట్లు నీళ్లు పోసుకుని వస్తూ ఉండగా ఆ నీటిని హైపర్ ఆది ఒక బకెట్తో పట్టుకోవాలని చూస్తారు.. కానీ సుమ ఏకంగా హైపర్ ఆది ముఖం మీద ఆ నీటిని ఉమ్మేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది.. ఇది చాలా ఫన్నీగా చేసిన ఎందుకో అందరికీ ఇబ్బందికరంగా మారింది. దీంతో సుమ పైన చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: