
అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో రెండుసార్లు బ్రేకప్ అయ్యిందని అమెరికాలో ఒకరితో రిలేషన్ షిప్ ఉండి బ్రేకప్ అయ్యాను మరొక నటి తో కూడా బ్రేకప్ అయ్యిందని.. నటి పూజిత పొన్నాడతో రిలేషన్ షిప్ లో ఉండేవాళ్లము.. పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ అయ్యిందని తెలిపారు.. పూజిత పొన్నాడ నేను ఉప్మా తినేసింది అనే ఒక షార్ట్ ఫిలింలో నటిస్తున్న సమయంలో దగ్గరయ్యాము.. ఆ సమయంలోనే రిలేషన్ షిప్ మొదలు పెట్టామని.. దానిని పెళ్లి వరకు కూడా తీసుకు వెళ్ళాము కానీ ఎందుకో చివరిలో కలిసి రాలేదని తెలియజేశారు.
వాసంతి కూడా తనకు మొదటి నుంచి స్నేహితురాలే ..శిరీష అనే అమ్మాయితో కూడా రిలేషన్ లో ఉన్నానని.. హౌస్ లోకి వెళ్లిన తర్వాత చాలానే ఇబ్బంది పడ్డానని అప్పటినుంచి పట్టించుకోలేదని తెలిపారు అర్జున్..బిబి జోడిలో కిస్ చేయడం కేవలం స్క్రిప్ట్ లాంటిదే ..కానీ శిరీష మాత్రం తనకు స్నేహితురాలే అంటూ తెలిపారు. ఎలాంటి విషయాలలోనైనా సరే ఖచ్చితంగా ఇంట్లో చెబుతానని.. శిరీష విషయంపై కూడా స్నేహితురాలని చెప్పానని తెలిపారు. పూజిత విషయంపై కూడా తాను చెప్పానని మా ఫ్యామిలీతో కూడా ఆమె టచ్ లో ఉండేది. బ్రేకప్ అయిన తర్వాత ఎవరిదారు వారు చూసుకున్నామంటూ తెలిపారు అర్జున్ కళ్యాణ్. మిస్సమ్మ అనే వెబ్ సిరీస్ తో బాగానే అలరించారు అర్జున్ కళ్యాణ్.