టెలికం రంగంలో సంచ‌ల‌నాలు సృష్టించి రిలయన్స్ జియో గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టెలికం విభాగంలో అగ్ర స్థానం సంపాదించుకున్న జియో అతి త‌క్కువ స‌మ‌యంలో యూజ‌ర్ల‌ను త‌న‌వైపుకు తిప్పుకుంది. ఇప్పటికే అతి తక్కువ ధరకే డేటా ప్యాక్స్‌ను, ఉచిత వాయిస్ కాల్స్‌ను అందిస్తున్న రిలయన్స్ జియో.. మ‌రో అద్భుత అవ‌కాశాన్ని అందిస్తుంది. జియో కొత్తగా లాంఛ్ చేసిన జియోపీఓఎస్ లైట్ కమ్యూనిటీ రీఛార్జ్ యాప్‌తో డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు.

 

ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని మీరు జియో పార్ట్‌నర్‌గా మారొచ్చు. జియో సబ్‌స్క్రైబర్లకు రీఛార్జ్ చేసి డబ్బులు సంపాదించొచ్చు. అంటే ఎవరైనా జియో యూజర్ ఉంటే వారి నెంబర్‌కు మీరు రీఛార్జ్ చేసి మీరు కమిషన్ పొందొచ్చు. ఈ యాప్ ప్ర‌స్తుతం మీకు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులోనే ఉంది. మ‌రి ఈ యాప్ రిఛార్జ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి. అందుకు ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో జియోపీఓఎస్ లైట్ డౌన్‌లోడ్ చేయండి. అన్ని పర్మిషన్స్ ఎల‌వ్‌ చేయండి. సైన్ ఆప్‌ పైన క్లిక్ చేయండి. 

 

ఇప్పుడు ఇమెయిల్ ఐడీ, జియో నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి. జ‌న‌రేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత డబ్బులు లోడ్ చేయాలి. మీ ఇష్టం డ‌బ్బులు ఎంతైనా లోడ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఏ జియో నెంబర్‌కైనా రీఛార్జ్ చేయొచ్చు. మీ కుటుంబ సభ్యుల‌తో పాటు ఇతరుల‌కు కూడా రీఛార్జ్ చేయొచ్చు. మీరు చేసే రీఛార్జ్‌లపై మీకు 4.16 శాతం కమిషన్ వస్తుంది. అంటే మీరు రూ.100 రీఛార్జ్ చేస్తే మీకు రూ.4.16 కమిషన్ వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: