వాట్సాప్‌.. నేటి స‌మాజంలో దీని వినియోగం ఏ రేంజ్‌లో పెరిగింది అనేది ప్ర‌త్యేకంగా లెక్క‌లు అవ‌స‌రం లేవు. స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ వాట్సాప్‌ను కూడా యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన ఈ మెసేజింగ్ యాప్ వాట్సాప్ రోజురోజుకు కొత్త పుంత‌లు తొక్కుతోంది. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు అనేక ర‌కాలు ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తూ.. ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ సులువుగా ఉండ‌డంతో ఎక్కువ శాతం మంది వాట్సాప్‌నే ఎంచుకుంటున్నారు.

 

అంతేకాదు, వాట్సాప్‌లో పొర‌పాటులు చేసినా స‌రిదిద్దుకునే అవ‌కాశాలు కూడా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే పొరపాటున ఎవరి చాట్ అయినా డిలీట్ చేస్తే.. మళ్లీ తిరిగి ఆ చాట్ ను పొందొచ్చు. అయితే దీనికి ప్రత్యేకమైన ఫీచర్ ఏమీ లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ పాటిస్తే స‌రిపోతుంది. పొరపాటున వాట్సాప్ చాట్ డిలీట్ చేస్తే గ‌నుక‌.. అది తిరిగి పొంద‌డానికి మీరు వెంటనే వాట్సాప్ లో ఎలాంటి ఆప్షన్ నూ కదిలించకుండా అన్ ఇన్ స్టాల్ చేయండి.
అనంతరం వాట్సాప్ ను తిరిగి ఇన్ స్టాల్ చేయండి.

 

ఇప్పుడు వాట్సాప్ లో ప్రొఫైల్ వివరాలు ఇచ్చిన అనంతరం వాట్సాప్ చాట్ బ్యాకప్ ను రీస్టోర్ చేయమంటారా అని అడుగుతుంది. అప్పుడు మీరు రీస్టోర్ చేయ‌మ‌నాలి. దీంతో వెంటనే మీరు పొరపాటున డిలీట్ చేసిన చాట్ మీకు తిరిగి ల‌భిస్తుంది. కానీ, ఈ ఆప్షన్ మీకు పని చేయాలంటే మీ వాట్సాప్ లో చాట్ బ్యాకప్ యాక్టివేట్ అయి ఉండాలి. అయితే అది ఆన్ అయిందో లేదో.. మేం ఆన్ చేయలేదే అని బాధ పడకండి. అది ఖ‌చ్చితంగా ఆన్ లోనే ఉంటుంది. మీరు అందులోకి ఆఫ్ చేస్తే తప్ప అది ఆఫ్ కాదు. చూశారుగా.. ఎప్పుడైనా పొర‌పాటున ముఖ్య‌మైన వాట్సాప్ చాట్‌ను డిలీట్ చేస్తే.. వెంట‌నే పైన చెప్పిన విధంగా టిప్స్ ఫాలో అయ్యి.. చాట్‌ను బ్యాక‌ప్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: