
ఇకపోతే ఈ వేరియంట్ ధర ను చూస్తే..వివో వై 12 ఎస్ అప్డేటెడ్ మోడల్ సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. దీనిలో 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ను అందించింది. దీని ధరను 10,500 గా కంపెనీ నిర్ణయించింది.వియత్నాంలో విడుదలైన ఈ ఫోన్ ఐ-బ్లూ, మిస్టీరియస్ బ్లాక్ కలర్స్లో లభిస్తుంది. వియాత్నాం ఈ-కామర్స్ సైట్ఎఫ్‌పిటి షాప్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే, ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. గతంలో వచ్చిన ఫోన్లు ఇప్పుడు తక్కువ ధరలో దొరుకుతున్నాయి.
ఆండ్రాయిడ్ 11 ఓఎస్ 11తో పనిచేస్తుంది. దీనిలో 20: 9 కారక నిష్పత్తితో కూడిన 6.51-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 SoC తో పాటు 3GB ram తో పనిచేస్తుంది. దీనిలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ను కూడా చేర్చింది. ఈ సెటప్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్లను అందించింది. మిగిలిన ఫీచర్లు అన్నీ కూడా గతంలో వచ్చిన ఫోన్ల మాదిరిగానే ఉంటుందని అంటున్నారు.. మరి ఎలా టాక్ ను అందుకుంటుంది అనేది చూడాలి..