ఇక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors), ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు కొత్త షోరూమ్ లను స్టార్ట్ చేసినట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు ఇంకా అలాగే విజయవాడ నగరాల్లో కంపెనీ తమ కొత్త షోరూమ్ లను ఏర్పాటు చేసింది.ఇక రివోల్ట్ మోటార్స్‌కు వైజాగ్ తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్‌లో మూడవ స్టోర్ అవుతుంది.ఇక రివోల్ట్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓపెన్ చేసిన స్టోర్ చిరునామా వచ్చేసి డోర్ నెంబర్ 25 - 2/13, కరెంట్ ఆఫీస్ సెంటర్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన), జిఎన్‌టి రోడ్ కాగా, విజయవాడలో ఓపెన్ చేసిన స్టోర్ చిరునామా వచ్చేసి ప్లాట్ నెం.10, పటమలంక (వెస్ట్ సైడ్ ఎదురుగా) ఉంది. భారతదేశంలో ఈ బ్రాండ్ ఇప్పటికే 22 షోరూమ్ లను రెడీ చేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి కంపెనీ తమ షోరూమ్‌ల సంఖ్యను 40కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇండియాలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించిన ప్రతి అంశానికి సపోర్ట్ ఇచ్చే మూడవ అత్యంత ఈవీ-ఫ్రెండ్లీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని కంపెనీ పేర్కొంది.



రాష్ట్రంలో ఈవీల స్వీకరణను వేగవంతం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం నిర్వహించే ఈవీ విధానాలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం ఇంకా అలాగే తయారీని ప్రోత్సహిస్తున్నాయి. అలాగే కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం రోడ్డు టాక్స్ మినహాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు వివిధ రకాల రాయితీలను కూడా అందిస్తుంది.ఇక అంతేకాకుండా, 2030 సంవత్సరం నాటికి సిటీ బస్సుల విషయంలో 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా అలాగే రాష్ట్రంలో ఈవీల తయారీ కోసం 30,000 కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా వెచ్చించాలని కూడా ప్లాన్ చేస్తోంది. దక్షిణ భారతదేశంలోని చెన్నై, కేరళ, కర్ణాటక ఇంకా తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడానికి అంకితమైన ఈవీ విధానాల (ఈవీ పాలసీల)ను కూడా అందిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: