ఇక ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో తన జీటీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ కంపెనీ కొత్త ఫోన్ పేరు Poco X4 GT. నివేదికల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఈ Poco X4 GT మే 24 వ తేదీ న చైనాలో రిలీజ్ కానుంది. ఇది redmi Note 11T ప్రో అప్‌గ్రేడ్ వెర్షన్. అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక వివరాలను అయితే వెల్లడించలేదు. అయితే ఇప్పటి దాకా లీక్ అయిన వివరాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ రాబోయే వారాల్లో మార్కెట్లో విడుదల చేసే ఛాన్స్ అనేది ఉంది. ఇక విడుదలకు ముందు ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్‌లు కూడా బయటపడ్డాయి. టెక్ టిప్‌స్టర్ ముకుల్ శర్మ కూడా ఈ ఫోన్‌ను క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదిక ద్వారా వినియోగదారులతో షేర్ చేసుకోవడం జరిగింది.


ఇక లీకైన POCO X4 GT స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే..POCO X4 GT ఫోన్‌ స్క్రీన్ సైజ్ వచ్చేసి మొత్తం 6.6 అంగుళాల FHD + LCD డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు.అలాగే ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek డైమెన్సిటీ 8100 చిప్‌సెట్ ద్వారా కూడా శక్తిని పొందుతుంది. SoC వచ్చేసి మాక్సిమం 8GB RAM, 256GB వరకు ఇంటర్నల్‌ స్టోరేజీతో రానున్నట్లు లీక్‌ల ద్వారా సమాచారం అనేది తెలుస్తుంది.ఇక అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ సూపర్ స్టైలిష్ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి గనుక వస్తే.. ఇది 48MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఇంకా అలాగే 2MP సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉందని ఆయన సోషల్ మీడియా ద్వారా చెప్పారు. వీడియో కాల్‌లు ఇంకా అలాగే సెల్ఫీల కోసం Poco X4 GT ముందు భాగంలో 20MP కెమెరాను ఉన్నట్లు సమాచారం అనేది తెలుస్తోంది. ఇంకా అలాగే Poco X4 GT 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: