హైదరాబాద్ లో రోజు రోజుకి వాహనాల సంఖ్య బాగా పెరుగుతుంది. వ్యక్తిగత వాహనాల తో పాటు ప్రజా రవాణా వాహనాలు కూడా చాలా ఎక్కువగా హైదరాబాద్ రోడ్లమీద తిరుగుతున్నాయి.ఇక ఇలానే కొనసాగుతే మనం భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ముందు తరానికి వాయు కాలుష్యం లేని గాలిని అందించాలని ఖచ్చితంగా ప్రభుత్వం భావిస్తోంది.ఇక దీంతో EV వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ లోని ‘enviro smart’ అనే ఒక కంపెనీ వాళ్ళు పాతబడిన ఆటోలను కొత్త ఆటోలుగా మారుస్తున్నారు. అంతేకాదు వాటి నుంచి డీజిల్ ఇంకా గ్యాస్ ఇంజన్ లను తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బ్యాటరీ ఆటో లుగా మారుస్తున్నారు.అలాగే హైదరాబాదులో ప్రజలు ఎక్కడ చూసినా ఆటోల్లోనే ఎక్కువగా తిరుగుతుంటారు. ఏ మూల చూసినా కానీ ఆటోలే దర్శనమిస్తాయి. ఇక అలాంటి ఈ ఆటోలు నుంచి పొల్యూషన్ ని తగ్గించడానికి ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తోంది. ఇక అందులో భాగంగా ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రికల్ ఆటోలను అందించి ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే ఉన్నది. ఈ ఆటోలే కాకుండా ప్రస్తుత కాలంలో అన్ని వాహనాలు ఎలక్ట్రికల్ గా మారుతున్నాయి.ఈ కొత్త ఆటోలు కాకుండా పాతబడిన ఆటోలు కూడా బ్యాటరీ గా మారితే చాలా పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంటుందని ఆలోచించారు హైదరాబాద్ లో enviro smart కంపెనీ.


ఇక రోజు రోజుకీ పెరుగుతున్న ఇంధన ధరల వలన ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు ఈ ఆటోల వలన ఏంతగానో లాభం కలుగుతుంది. పాత ఆటోల నుంచి డీజిల్ ఇంకా గ్యాస్ ఇంజన్లను తీసేసి ఎలక్ట్రిక్ బండ్లుగా మారుస్తున్నారు కంపెనీ యాజమాన్యం.ఇంకా అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వెహికల్స్ కి రీ మోడిఫికేషన్ చేసి వాటికి కావలసిన అప్రూవల్ తెచ్చుకొని కస్టమర్ల పాత ఆటోలను తీసుకొని ఎలక్ట్రికల్ ఆటోలుగా కూడా మారుస్తున్నారు. ఇలా చేయడం వలన ఇంధన ధరలతోనే కాకుండా ఇంకా వాతావరణ పొల్యూషన్ ని కూడా తగ్గిస్తున్నారు.అలాగే ఎలక్ట్రిక్ రెట్రో ఫిట్మెంట్ ఇంజన్ కి తక్కువ ఖర్చు అవుతుంది.ఇక కొత్త ఆటో ఖర్చుతో పోలిస్తే 60% లోనే పాత ఆటోను కొత్త దానిలా ఎలక్ట్రికల్ ఆటోగా మార్చవచ్చు. ఇంకా ఇలా ఇంజన్ మార్చే ప్రాసెస్ లో ఆటోమొబైల్స్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ తెచ్చుకొని 20 రకాల టెస్టులు అధిగమించి ARAI సర్టిఫికేషన్ ని కూడా పొందారు.ప్యాసింజర్ ఆటోలతో పాటు కారు ఇంకా అలాగే ఆటోలను కూడా ఎలక్ట్రికల్ గా మారుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: