
ధర పరంగా చూసుకుంటే కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యతరగతి ప్రజలు వన్ ప్లస్ ఫోన్ కొనడం చాలా కష్టంగా మారిపోయింది దీంతో మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ కంపెనీ నార్జ్ సిరీస్ గల మొబైల్ ని విడుదల చేసింది. ఈ మొబైల్ అప్డేట్ చేస్తు నార్జ్ CE ను విడుదల చేయడం జరిగింది ఈ మొబైల్ కూడా విపరీతంగా వినియోగదారులను ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఈ మొబైల్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయి .ఈ మొబైల్ ఏప్రిల్ 4వ తేదీ నుంచి విడుదల చేసే అవకాశం ఉన్నది వన్ ప్లస్ నార్డ్ CE -3 లైట్ మొబైల్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెస్ వస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ మొబైల్ ధర రూ.21,999 రూపాయలుగా ఉంటుంది.. అయితే స్టోరేజ్ వివరాలు ఇంకా వెల్లడించలేదు.. కేవలం ఈ మొబైల్ 8GB RAM+128 GB స్టోరేజ్ వేరియేంచాలో ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 MAH సామర్ధ్యంతో బ్యాటరీ ఉంటుంది. అలాగే పాస్ టెల్ లైవ్ క్రోమోటిక్ గ్రే కలర్స్లో లభిస్తాయి. ఇక కెమెరా 108 ఎంపీ త్రిబుల్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.