ప్రస్తుతం డిస్‌ప్లేకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియాకి చెందిన ఫేమస్ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.లావా బ్లేజ్‌ కర్వ్‌ 5జీ పేరుతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.చాలా తక్కువ బడ్జెట్‌లోనే సూపర్ ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ మంగళవారం నాడు లాంచ్‌ అయ్యింది.ఇక మార్చి 14వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్‌ అమ్మకానికి రానుంది. లావా ఈ స్టోర్‌లతో పాటు లావా రిటైల్‌ స్టోర్స్‌లో కూడా ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్లో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయి.? ఈ ఫోన్ ధర ఎంత.? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఈ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. లావా బ్లేజ్‌ కర్వ్‌ 5జీ స్మార్ట్ ఫోన్‌ను మొత్తం రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు.ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.17,999 కాగా, 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర వచ్చేసి రూ.18,999గా నిర్ణయించారు. ఐరన్ గ్లాస్, విరిడియన్ గ్లాస్ కలర్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చారు.ఇక ఈ లావా బ్లేజ్‌ కర్వ్‌ 5జీ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వర్క్ చేస్తుంది. ఇక స్క్రీన్‌ను అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ 3డీ కర్వ్డ్‌ డిస్‌ప్లేను అందించడం జరిగింది. అలాగే 120Hz రిఫ్రెష్‌ రేటు ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో చాలా బాగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు.ఇంకా అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. మరి చూడాలి ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: