వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా.. నిజంగానే ఆ చిన్నారి 13 అంతస్థులపై నుండి వేలాడుతున్నాడు. అసలు కథ ఏంటి? ఎందుకు వేలాడుతుంది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. అసలు విషయం ఏంటి అంటే? ఓ ఎత్తైన అపార్టుమెంట్.. వాళ్ళు ఎంతో ఎత్తులో నివసిస్తున్నారు.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే సురక్షితంగా ఉంటారు. 

 

లీకపోతే.. ఎంతో దారుణమైన ఘటనలు జరుగుతాయి. ఆ ఘటనలు తలుచుకుంటుంటేనే భయంగ ఉంది కదా! భయంగా ఉన్నప్పటికీ నిజంగానే ఓ భయంకరమైన ఘటన ఉంది. ఆ ఘటన ఏంటి అంటే? చైనాలోని కున్మింగ్‌లో ఐదేళ్ల చిన్నారి 13వ అంతస్తు బాల్కానీకి వేలాడుతూ కనిపించింది. 

 

చిన్నారి ఏడుపు విన్న ఇరుగు పొరుగువారు వెంటనే అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. అంతేకాదు.. అగ్నిమాపక దళం ఎప్పుడు వస్తుందో అని.. రావడానికి ఆలస్యం అయినా మేము అయినా కాపాడాలి అని స్థానికులంతా ఒక్కటై పెద్ద బ్లాంకెట్‌ను పట్టుకుని నిలుచున్నారు. అయితే అనుకున్న దాని కంటే ముందే అగ్నిమాపక సిబ్బంది వచ్చింది. 

 

ఇంకా నేలకి సుమారు 130 అడుగుల ఎత్తులో ప్రమాదకరంగా వేలాడుతున్న చిన్నారిని చూసి అగ్నిమాపక సిబ్బంది సైతం షాక్ అయ్యింది. అయితే ఆ అగ్నిమాపక సిబ్బంది వెంటనే 15వ అంతస్తులోకి వెళ్లారు. అక్కడ నుంచి ఒక ఫైర్ ఫైటర్ నెమ్మదిగా వేలాడుతున్న ఆ చిన్నారిని వద్దకు చేరి ఎంతో జాగ్రత్తగా ఆ చిన్నారిని పట్టుకుని ప్రాణాలు రక్షించాడు.

 

అయితే ఆ చిన్నారి తల్లితండ్రులు ఆమెను ఒంటరిగా వదిలి బయటకు వెళ్ళింది. ఇంకా ఇంతలోనే ఆ పిల్లా అలా వేలాడుతుంది. ఇంకా ఆపిల్ల తల్లి మాట్లాడుతూ కింద డెలివరీ తీసుకోవడానికి చిన్నారిని ఇంట్లో వదిలి వెళ్లినట్టు ఇంతలోనే ఆలా అయ్యింది అని ఆమె వాపోయింది. అయితే ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: