
అంతే పాటు ఫరీద్ మమూంద్ జే తన ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని అందిస్తూనే .." నిన్న రాత్రి సమయంలో కందహార్లో డానిష్ సిద్దికిని, హత్య చేసిన విషాద వార్తలతో రాయిటర్స్ సంస్థ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇండియన్ జర్నలిస్ట్ అలాగే పులిట్జర్ ప్రైజ్ విజేత అయిన సిద్ధికి ఆఫ్ఘన్ లో తాలిబన్ల దాడులకు మరణించడం విషాదకరంగా ఉంది. ఆయన కాబూల్‌కు బయలుదేరే ముందు 2 వారాల క్రితమే ఆయనను కలిశాను. " మా జీవితాలలో ఇదొక విషాద సంఘటన అని ఆయన తెలిపారు.
అలాగే రైటర్స్ సంస్థ అధ్యక్షుడు అయిన మైకేల్ ఫ్రీడెన్ బెర్గ్ లతో పాటు ఎడిటర్-ఇన్-చీఫ్ అలెగ్జాండ్రా గాలనో కూడా తమ ఫోటోగ్రాఫర్ ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరం అంటూ తెలపడం జరిగింది. సిద్ధికి ఇండియా టుడే సంస్థలో టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్ గా 2008 నుంచి 2010 వరకు తన వృత్తిని చేపట్టి, తర్వాత రాయిటర్ సంస్థలో ఫోటోగ్రాఫర్ గా ఉద్యోగంలో వుండేవారు.ఫోటో జర్నలిస్ట్‌గా, డానిష్ సిద్దిఖీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాల సమస్యలను కవర్ చేసేవారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలు, రోహింగ్యా శరణార్థుల సంక్షోభం తోపాటు హాంకాంగ్ నిరసనలు అలాగే నేపాల్ భూకంపాలు వంటివి ప్రధానంగా ఫోకస్ చేసేవారు.
ఇక ఈయన తోపాటు ఒక సైనిక అధికారి కూడా మరణించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ దాడులు జరగడానికి కారణం.. ఆఫ్గాన్ నుంచి అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవడం. అందుకే ఆదేశం గత కొద్ది రోజులుగా హింసాత్మక సంఘటనలతో ఇబ్బంది పడుతోంది.