ఇక పెళ్లంటే నూరేళ్ల పంట అని అందరికి తెలిసిన మాటే.పెళ్లి బంధం అనేది కలకాలం నిలిచేందుకు హిందూ పెళ్లిల్లలో వధువరులతో ప్రమాణం చేయిస్తారు. అయితే ఇక పెళ్లిలో చేసే ఆ ప్రమాణాలు తమకు సరిపోవంటూ పెళ్లి కూతురు కుటుంబం కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు రావడం జరిగింది. పెళ్లి చేసుకుని పెళ్లి కూతురితో అత్తింటికి వచ్చిన పెళ్లి కొడుకుని ఇంటి బయటే నిలబెట్టి మరీ వారు ఓ వింత ఒప్పందం చేసుకున్నారు.ఇక HappyFrames అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియో ప్రకారం..పెళ్లి కొడుకు ఆయుష్, పెళ్లి కూతురు రాధికతో కలిసి అత్తింటికి వెళ్లాడు. ఈ సందర్భంగా పెళ్లి కూతురు తోబుట్టువులు ఆయుష్‌ను ఇంటి ముందే ఆపేయడం జరిగింది. ఇక ఆ ఇంట్లోకి ప్రవేశించాలంటే కొన్ని షరతులను అంగీకరించాలని తెలిపడం జరిగింది.

ఇక ఈ సందర్భంగా మూడు షరతులతో కూడిన ఒప్పంద పత్రాన్ని (ఫ్లెక్సీ) అతడి ముందు ఉంచడం జరిగింది.ఇక అందులో మొత్తం మూడు షరతులు ఉన్నాయి. అవేంటంటే ‘‘రాధిక ఎప్పుడూ కూడా సరైనదే’’, ‘‘ఆమెను సంవత్సరానికి రెండు లేక మూడు సార్లు విదేశాలకు తీసుకెళ్లాలి’’, ‘‘రాధిక ఎప్పుడు ఏమి అడిగినా అది వెంటనే కొనివ్వాలి’’ అనే పాయింట్లు ఒప్పందంలో ఉన్నాయట. ఇక చివర్లో ‘‘ఈ షరతులన్నీ అంగీకరిస్తూ ఇక్కడ సంతకం చేయండి. లేకపోతే ఇక్కడ ప్రవేశం లేదు’’ అని రాశారు. అవన్నీ శ్రద్ధగా చదివిన పెళ్లి కొడుకు ఒప్పుకోక తప్పుతుందా అన్నట్లుగా దానిపై సైన్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూస్తే మీరు తప్పకుండా నవ్వుకొని తీరుతారు. ఇక ఈ కన్సెప్ట్ నచ్చడంతో నెటిజనులు దీనికి ఫిదా అయ్యి తెగ నవ్వుకుంటున్నారు.ఇంకా మీకు బాగా క్లారిటీగా తెలియాలంటే వెంటనే ఇంస్టాగ్రామ్ లో ఆ పేజీ ఓపెన్ చేసి చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: