అమ్మాయి మీద అమ్మకు నమ్మకం, అబ్బాయి మీద అనుమానం... కాని నాన్నకు అమ్మాయి అంటే ప్రేమ, అమ్మకు అబ్బాయంటే ప్రేమ... కాని కొడుకు చెప్పేది ఇద్దరూ నమ్మరూ... కొడుకు కూర్చున్నా నుంచున్నా అనుమానమే. తండ్రి ఏమో కొడుకు అనుమానంగా ప్రవర్తిస్తే ఎరా దొంగ నాకొడకా ఏం చేసావ్ రా అంటాడు... అదే అమ్మ అయితే... ఏరా నాన్న ఎన్ని సార్లు తిట్టినా సిగ్గురాదురా నీకని ఒకసారంటుంది. ఎందుకు తిడుతున్నారని ఒక్కోసారి కొంగు చాటున కొడుకుని దాచుకుని భర్త మీద ఫైర్ అవుతుంది.

కూతురు ఏం చెప్పినా దాదాపుగా తల్లి, తండ్రి ఇద్దరూ నమ్ముతారు గాని కొడుకు మాటే కాస్త కష్టంగా వింటారు. కొడుకు వింతగా ప్రవర్తిస్తే మాత్రం భూతద్దంలో పెట్టి చూసినట్టు మాట్లాడేస్తారు. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే... ఇప్పుడు ఫేస్బుక్ లో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏంటా వీడియో అంటే... ఒక యుట్యూబ్ ఛానల్ సరదాగా ఒక అమ్మాయిని అబ్బాయిని ఇద్దరినీ ఫ్రాంక్ తరహాలో కొన్ని ప్రశ్నలు వేసి... అమ్మాయిని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి... అమ్మకు ఐ లవ్ యు చెప్పమని యాంకర్ అడిగాడు.

అమ్మాయి ఏ మాత్రం తడబడకుండా ధైర్యంగా అమ్మకు ఫోన్ చేసి... అమ్మా ఐ లవ్ యు అంటుంది... ఎందుకు నాన్నా అని అడిగితే... నాకు ఐ లవ్ యు టూ చెప్పూ అంటే... ఐ లవ్ యు టూ నాన్నా బంగారు తల్లి అంటుంది. అదే సమయంలో అబ్బాయి ఫోన్ చేసి... అమ్మా ఐ లవ్ యు అంటే... ఏరా తాగినవా అంటూ ఎదురు ప్రశ్నించడంతో అబ్బాయి షాక్ అయ్యాడు. ఈ వీడియో చూసిన చాలా మంది అమ్మాయి మీద అమ్మకు ఉన్న నమ్మకం కొడుకు మీద లేదంటూ కామెంట్ చేస్తున్నారు. పలువురు ఈ వీడియోని షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: