సాధారణంగా ఇంటికి సంబంధించిన ఏ వస్తువైనా లేదా సామగ్రి అయినా ఇంటి యజమాని దుకాణానికి వెళ్లి తీసుకొస్తాడు. ఒక వేళ కుక్క వెళ్లి తీసుకొస్తే ఎలా ఉంటుందో? ఊహించుకోండి.. అదేంటీ? కుక్క షాపునకు వెళ్లడమేంటి? అనుకుంటున్నారా? అవునండీ.. మీరు చదివింది నిజమే.. ఈ ఇంట్లో కుక్కనే మనిషి మాదిరిగా కిరాణా షాపునకు వెళ్లి సామగ్రి తీసుకొస్తుంది. ఇంతకీ ఆ కుక్క ఎక్కడుంది? అనే విషయం తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీని చదవాల్సిందే.


విశ్వాసానికి ప్రతీక అయిన కుక్క గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సిటీస్‌లో ప్రతీ ఇంట్లో ఒక డాగ్ ఉండటం మనం చూడొచ్చు. శునకాన్ని ప్రేమించే వారు కూడా చాలా మందే ఉంటారు. శునకాల వల్ల మనిషికి మానసిక ఆనందం లభిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది మనుషులకు హెల్ప్ చేయడంతో పాటు ఓ ఫ్రెండ్‌లా ఉంటుంది. సదరు యజమాని ఇంటికి కుక్క రక్షణాగాను కుక్క ఉండిపోతుంది. ట్రైనింగ్ ఇస్తే డాగ్స్ ఎలాంటి పనులైనా చేయగలవు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన జాక్ స్పారో అనే కుక్కకు దాని యజమాని ఓ వింత ట్రైనింగ్ ఇచ్చాడు.ఏం లేదండీ.. జాక్ స్పార్ అనే డాగ్ స్వయంగా తనే వెళ్లి షాపింగ్‌ చేస్తుంది. తన ఓనర్‌కు కావాల్సిన సామగ్రిని కొనుక్కొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తుంది. షాప్‌లో డబ్బులు చెల్లించగా, మిగిలిన చిల్లరను తీసుకొచ్చి జాగ్రత్తగా ఓనర్‌కు అప్పజెప్పుతుంది. తమిళనాడులోని దిండిగుల్‌ జిల్లా పళనిలోని ఈ డాగ్ ఉంది. దాస్‌ ఫెర్నాండెజ్‌ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్కనే జాక్‌ స్పారో. నాలుగేళ్ల వయసు ఉండే ఈ లాబ్రడార్‌ జాతి కుక్కకు షాపునకు వెళ్లి వస్తువుల తీసుకువచ్చేలా ఓనర్ దాస్ ట్రైనింగ్ ఇచ్చాడు. దాంతో అది అలా సామగ్రి తీసుకొస్తున్నది. అది చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఈ క్రమంలో ఒకతడు కుక్క చేసి పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, అది తెగవైరలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: