ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో క్రేజ్ సంపాదించడం చాలా కష్టంగానే మారింది అని చెప్పాలి.  ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజ్ కోసం కోట్ల ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రమే క్రేజ్ రావడం  జరుగుతుంది. అలాంటిది ఓవర్ నైట్ లో క్రేజ్ వచ్చి ఏకంగా సెలబ్రిటీ హోదా సంపాదించాలంటే అది మామూలు విషయం ఏమీ కాదు. అలా జరగడం కూడా దాదాపు కష్టమే. కానీ ఎక్కడో ఒక పెళ్లికూతురికి మాత్రం ఏకంగా  పెళ్లి చేసుకోవడమే సెలబ్రిటీ హోదాను తెచ్చిపెట్టింది. ఎందుకు అంటారా పెళ్లి చేసుకున్న తర్వాత నిర్వహించే  ఊరేగింపులో పెళ్లి కూతురు చేసిన డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.



 కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఇక ఈ వీడియో ఎంతో మందిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ సాంగ్ అయినా బుల్లెట్ బండి వచ్చేస్తా బా అనే పాట పై పెళ్లి కూతురు చేసిన అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఒక్క డాన్స్ పర్ఫార్మెన్స్ తో  ఏకంగా  ఓవర్నైట్ సెలబ్రిటీగా మారిపోయింది ఆ పెళ్ళికూతురు .  ఓవర్ నైట్ లో ఇంత క్రేజ్ వచ్చిన తర్వాత ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇక ఇప్పుడు ఈ కొత్త పెళ్లి కూతురు కూడా ఎంతో సంతోష పడిపోతుంది .  ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కు తన భర్తతో కలిసి ఇంటర్వ్యూ  ఎంట్రీ ఇచ్చింది ఈ నవ వధువు .



 తమ పెళ్ళి ఊరేగింపులో తాను చేసిన బుల్లెట్ బండి సాంగ్ పై డాన్స్ ఇంత వైరల్ అవుతుంది అని అస్సలు ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇక తన వీడియో ట్రెండింగ్ లో ఉందని ప్రస్తుతం తన వీడియో అందరినీ ఆకర్షిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆ పాట పై డాన్స్ చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నామని.. ఈ విషయం తన భర్తకు తెలియదని సర్ప్రైస్ ఇవ్వాలని అనుకున్నాను అంటూ తెలిపింది. కానీ ఇక తాను చేసిన డాన్స్ మాత్రం ఇంత వైరల్ గా మారిపోతుంది అని మాత్రం ఊహించలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది.  తర్వాత మాట్లాడిన ఇక ఆమె భర్త ప్రస్తుతం కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాదు చాలా ప్రాంతాల నుంచి కూడా ఆ వీడియో చాలా బాగుంది అంటూ చెబుతూ ఎన్నో కాల్స్ వస్తున్నాయి అంటూ ఆనందం వ్యక్తం చేశారు.




ఆ వధువు వివరాలు ఏంటో తెలుసుకుందాం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్‌కల్ గ్రామానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు బుల్లెట్ బండి పాట పై డాన్స్ చేసిన సాయి శ్రీయ. ఇటీవలే యువతికి రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం ఈ నెల 14న వివాహం జరిగింది. సాయి శ్రీయ విప్రోల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అశోక్ జీహెచ్‌ఎంసీలో ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శ్రీయ తన పెళ్లి బారాత్‌లో ఆమె ఆనందంలో.. భర్తతో జీవితాంతం కలిసి ఉంటానని తెలిపేలా బుల్లెట్ బండి సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. దీంతో ఇక ఈ వీడియో హాట్ టాపిక్ గా మారిపోయి సెలబ్రిటీ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: