ఇప్పటికే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఎంతోమంది ప్రాణాలు తీస్తుంది. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కేవలం ఒక దేశంలో మాత్రమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్షణంలో  కరోనా  వైరస్ దాడి చేసి ప్రాణాలు తీస్తుందో భయపడిపోతున్న పరీస్థితి. ఇలాంటి సమయంలో మనుషులు చేజేతులా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఒక వైపు హత్యలు మరోవైపు ఆత్మహత్యలు చివరికి మనుషుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయ్. ఇక మరోవైపు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది.


 రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది జీవచ్ఛవాలుగా మారిపోయి బతుకు భారం గా మార్చుకుంటున్నారు.  మరికొంతమంది చివరికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. అతివేగం రోడ్డు నిబంధనలు పాటించక పోవడం వెరసి ఇలా రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవలే ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఒక బైక్ ని కారు ఢీ కొట్టిన ఘటనలో బైక్ గాల్లో ఎగిరి పల్టీలు కొట్టిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.


 ఈ వీడియో చూసిన తర్వాత ఇది సినిమా ఫ్రంట్ కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ఉంది అని అందరూ అనుకుంటున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని ఘజియాబాద్లో వెలుగులోకి వచ్చింది.  రహదారిపై ఒక కారు దూసుకు వస్తుంది. అదే సమయంలో  ఒక బైక్ ఆ రహదారి మీదికి వచ్చింది. దీంతో అదే వేగంతో బైక్ను ఢీకొట్టింది కారు. దీంతో బైక్ రైడర్ కొన్ని సెకండ్ల పాటు కాళ్లు పల్టీలు కొట్టి కారు మీద నుంచి కిందకు జారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన సదరు వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భయపడిపోయిన కారు డ్రైవర్ కారు అక్కడే వదిలేసి పరారయ్యాడు.  దీనికి సంబంధించిన దృశ్యాలు సిసిటివి ఫుటేజీలో నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: