ఇటీవల కాలంలో యువతీ యువకులందరూ కూడా తమ పెళ్లిని ఊహకందని రీతిలో ఎంతో గ్రాండ్గా చేసుకోవాలని భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే పెళ్లి కోసం తాహతకు మించి ఖర్చుచేస్తున్నవారు కూడా నేటి రోజుల్లో కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక పెళ్లి జరుగుతుంది అంటే చాలు ఆ ఇంట్లో సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని రోజుల ముందు నుంచి బంధుమిత్రులందరూ కూడా ఇంట్లో చేరి సందడి చేస్తూ ఉంటారు.


 ఈ క్రమం లోనే పెళ్లి ఇంట్లో ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణమే ఉంటుంది.  అయితే ఇక పెళ్లి ఇంట్లో ఎంత మంది బంధువులు ఉన్నా కూడా అటు స్నేహితులు చేసే హడావిడినే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పెళ్లి కొడుకును లేదా పెళ్లికూతురును సంతోషంగా ఉంచడానికి లేదా ఆట పట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు  స్నేహితులు. కొన్ని కొన్ని సార్లు స్నేహితులు ఊహించని సర్ ప్రైస్ లు కూడా ఇస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలాగే పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్న ఒక పెళ్లికూతురుకి స్నేహితుడు సర్ ప్రైస్ ఇచ్చాడు.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక తన పెళ్లికి రాడు అనుకున్న స్నేహితుడు తన కళ్ళ ముందు వాలిపోవడంతో ఇక పెళ్లికూతురు ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. దీంతో ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది. ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ముందుగా ఒక డాన్స్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. మెహందీ వేడుక సందర్భంగా ఇది జరిగింది. ఇక ఇలా అందరూ డాన్స్ పర్ఫామెన్స్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో మూడో స్నేహితుడు అక్కడ ప్రత్యక్షం కావడంతో పెళ్లికూతురు ఎమోషనల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: